Terrorist | Hunger strike | Chanchalguda

Terrorists are hunger strike at chanchalguda jail

Terrorist, jail, Hunger strike, chanchalguda, jahid, khalil, abid hussain, beshwak, shakeel,vikaruddin

terrorists are Hunger strike at chanchalguda jail. Terrorists jahid, khalil, abid hussain, beshwak, shakeel doing Hunger strike for encounter of vikaruddin. Police encountered terrorist vikaruddin last three days ago.

వాళ్లేమో ఉగ్రవాదులు.. చేస్తున్నదేమో నిరాహార దీక్ష..!

Posted: 04/15/2015 10:26 AM IST
Terrorists are hunger strike at chanchalguda jail

వారంతా కరడుకట్టిన ఉగ్రవాదులు.. మనుషుల రక్తం మరిగిన మృగాలు. అలాంటి వారు సడన్ గా గాంధీ గారి మార్గం పట్టారు. నిరాహార దీక్షకు దిగారు. కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న వారు నిరసన నిరాహార దీక్షతో తెలుపుతున్నారట. మొత్తానికి నిరాహార దీక్ష చేస్తున్న వారు ఎవరో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.. ఎవరో కాదు ఉగ్రవాదులు జాహిద్, ఖలీమ్, ఆబిద్ హుస్సేన్ , బిశ్వాక్, షకీల్‌లు. ఎన్నో నేరాలు చేసి, మనుషుల ప్రాణాలను ఈజీగా తీసే వాళ్లు ఇలా నిరాహార దీక్ష చెయ్యడం ఏంటా అని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే..

చంచల్‌గూడ జైల్లో ఉన్న ఐఎస్‌ఐ తీవ్రవాదులు నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల ఇన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఐఎస్‌ఐ తీవ్రవాది వికారుద్దీన్‌కు మద్దతుగా ఈ దీక్ష చేపడుతున్నట్లు తీవ్రవాదులు రాతపూర్వకంగా లేఖ ఇచ్చారని జైలు సూపరింటెండెంట్ సైదయ్య తెలిపారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఐదుగురు ఉగ్రవాదులు జాహిద్, ఖలీమ్, ఆబిద్ హుస్సేన్, బిశ్వాక్, షకీల్‌లు ఉన్నారు. కాగా ప్రతిరోజులాగే వారికి ఆహారం అందజేసిన ట్లు అధికారులు తెలిపారు. వీరు దీక్ష చేపట్టడం వెనుక ఎవరి ఆదేశాలైనా ఉన్నాయా లేక జైలు నుంచి కోర్టుకు తరలించే క్రమంలో వీరికి ఎవరైనా సమాచారం ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులను ఆఖరుసారిగా ఈ నెల 9న విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టుకు తరలించారు. మరి ఇలాంటి వారు నిరాహార దీక్ష దిగడం సిగ్గు చేటు అని మనం అనుకున్నా.. ఇది ఇండియా ఇక్కడ అందరికి స్వేచ్ఛ ఉంది. ఉగ్రవాదులే అయినా నిరసన తెలిపే హక్కు వారికి ఉంది మరి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terrorist  jail  Hunger strike  chanchalguda  jahid  khalil  abid hussain  beshwak  shakeel  vikaruddin  

Other Articles