nara lokesh stucked kuppam | tdp supporters | Farmers loan weaver

Nara lokesh stucked kuppam tdp supporters question loan weaver

nara lokesh news, nara lokesh controversy, nara lokesh updates, kuppam news, kuppal farmers, ap farmers loan weaver, tdp supporters, chandrababu naidu

nara lokesh stucked kuppam tdp supporters question loan weaver : Ap cm chandrababu son nara lokesh stucked by tdp supporters in kuppam. They questioned lokesh to give promise on loan weaver.

బాబు నియోజకవర్గంలోనే చినబాబుకు ‘ప్రశ్నల’ చుక్కెదురు!

Posted: 04/14/2015 06:15 PM IST
Nara lokesh stucked kuppam tdp supporters question loan weaver

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త అయిన నారాలోకేష్ కు ఆయన తండ్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. కార్యకర్తల సంక్షేమ యాత్ర ప్రారంభించడానికి మంగళవారం కుప్పం వచ్చిన లోకేశ్ను అక్కడి కార్యకర్తలు.. ‘షరతులు లేని రుణమాఫీ ఎక్కడ?’ అంటూ నిలదీశారు. దీంతో కార్యకర్తలు ఒకేసారి ఇలా రుణమాఫీపై నిలదీయడంతో ఆయన కాస్త ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. పైగా.. తండ్రి సొంత నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితి ఎదురుకావడంపై ఆయన ఖంగుతిన్నారు.

ఈ క్రమంలోనే కార్యకర్తలు లోకేష్ ను ప్రశ్నిస్తూ.. ‘ఎన్నికలకు ముందు షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో అప్పుడు మాతోపాటు ఇతర పార్టీ వాళ్లతో కూడా టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేయించాం. కానీ అధికారంలో వచ్చిన తర్వాత షరతులతో విధిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొంతమంది రైతులకు ఇంకా రుణ మాఫీ జరగలేదు. పాత రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి నోటీసులు కూడా అందుతున్నాయి. తిరిగి కొత్త రుణాలు కూడా ఇవ్వడం లేదు’ అని తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తమకు సమాధానం కావాలంటూ కార్యకర్తలు పట్టుబట్టారు.

ఇలా కార్యకర్తలు అడిగిన ప్రశ్నలతో కాస్త ఇబ్బందిపడ్డ లోకేష్... బ్యాంకర్లతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరికైతే రుణాలు మాఫీ కాలేదో వారికి మాఫీ అయ్యేలా ప్రణాళికలు త్వరలోనే చేపబడుతామని అన్నారు. అనంతరం ఆయన తన యాత్రను కొనసాగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  chandrababu naidu  ap farmers  

Other Articles