Chadalavada Krishnamurthy has been appointed chairman of Tirumala Tirupathi devasthanam

Chadalavada krishnamurthy to be new ttd chairman

Chadalavada To Be TTD New Chairman, Chadalavada Krishnamurthy, TTD Chairman, TTD, TTD board

Chadalawada Krishnamurthy would soon be appointed as the new Chairman of Tirumala Tirupati Devasthanam.

తిరుమల వెంకన్న బొర్డు చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి

Posted: 04/11/2015 08:08 PM IST
Chadalavada krishnamurthy to be new ttd chairman

తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు చదలవాడ పేరును ఖరారు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు ఛైర్మన్ గా నియమించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఆదివారం లోగా వెలువడనున్నాయి. చదలవాడతో పాటుగా 18 మంది సభ్యులతో టీటీడీ బోర్డు ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ నుండే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల వారికీ చోటు కల్పించనున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీకీ ఈ కమిటీలో చోటు కల్పించనున్నారు. బీజేపీ కోరిన మేరకే టీటీడీలో ఆ పార్టీకి ప్రాతినిధ్యుం లభించనున్నది.

టీటీడీ మెంబర్లుగా బోండా ఉమ, భాను ప్రకాష్‌ రెడ్డి, గౌతు శ్యామసుందర్‌ శివాజి, పిల్లి అనంత లక్ష్మి, కోళ్ల లలిత కుమారి. తెలంగాణ నుంచి చింతల రామచంద్రారెడ్డి, సాయన్న, సండ్ర వెంకట వీరయ్యకు స్థానం కల్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం వెళ్తూ టీటీడీ సభ్యుల జాబితాను తనవెంట తీసుకెళ్లారు. ఈ జాబితాను చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రమే అధికారికంగా ప్రకటిస్తారా లేక చైనా నుంచి వచ్చాక ప్రకటిస్తారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chadalavada Krishnamurthy  Ex.MLA  TTD Board  

Other Articles