Nagari MLA and YSRCP leader Roja fainted during protest

Roja faints during protest admited in puttur hospital

YSRCP MLA Roja Faints, Roja Hospitalized. YSR Congress party MLA Roja hospitalized, Nagari MLA Roja, Roja admited in putur Hospital, YSRCP, MLA Roja, Faints, Hospitalized, Putturu Police Station, Doctors, SC/ST Cases'

Nagari MLA and YSRCP leader Roja fainted while staging a dharna in front of Puttur police station in Chittur district. Roja was staging a dharna demanding suspension of the CI and the SI for foisting cases against her.

ITEMVIDEOS: ధీరనారే.. కానీ సృహకోల్పోయి.. అస్పత్రిలో చేరింది.. రోజా..!

Posted: 04/11/2015 02:56 PM IST
Roja faints during protest admited in puttur hospital

వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి, టీవీ యాంకర్, పలు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్నరోజా మూడు రంగాలలోనూ రాణిస్తూ.. బిజీగా మారారు. దీనికి తోడు  రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు దూసుకుపోతున్న అమె కొంత నీరసం ఉండటం సహజం. అయితే అనుకున్న పనిని అయ్యేంత వరకు వదులుకోవడం ఇష్టంలేని రోజా.. ఇవాళ చిత్తూరు జిల్లా పుత్తూరు సీఐ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఉదయాన్నే తన కార్యకర్తలతో పుత్తూరు చేరుకుని సిఐ కార్యలయం ఎదుట ధర్నా చేపట్టిన అమె అనుకోకుండా సొమ్మసిల్లి పడ్డారు. దాంతో ఆమెను వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అమె ఆరోగ్యం కుదుటపడందని వైద్యులు వెల్లడించారు. అయితే కొన్ని రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.

 

 

తన నియోజకవర్గంలోని పుత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు రోజా. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ బీసీ రుణాల విషయమై అధికారులను ఎమ్మెల్యే రోజా నిలదీశారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు రోజాతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్బంగా తాము ఎస్సీ, ఎస్టీలము కాదని, తమ వద్దకు రావచ్చని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రోజా చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గోరంతలు కొండంతలు చేశారు. టీడీపీ నాయకులు శుక్రవారం సాయంత్రం రోజా వ్యాఖ్యాలపై పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు చేసి ఎస్ఐ, సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం పుత్తూరు సీఐ కార్యాలయం ఎదుట రోజా ధర్నా నిర్వహించారు. ఆ క్రమంలో అమె సొమ్మసిల్లి పడ్డిపోయారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  ysrcp mla  puttur hospital  

Other Articles