Roja | Police | Chittur | Daliths | Case

Ysrcp mla roja tdp leaders protesters at puttur police station

ysrcp, roja, sc,sts, dharna, chittur, mpp, case, police, puttur

ysrcp mla roja, tdp leaders protesters at puttur police station. ysrcp mla roja once more sentences contraversial statements on sc,sts at chittur. roja in the dharna at chitur mpp office. roja statements on local si, who doing duty at mpp office.

చూడండి బాబూ.. పుత్తూరు పిఎస్ వద్ద రోజా రాజకీయ డ్రామా

Posted: 04/11/2015 12:33 PM IST
Ysrcp mla roja tdp leaders protesters at puttur police station

పుత్తూరు పోలీస్ స్టేషన్ ముందు రాజకీయ నాయకుల పోటాపోటీ ధర్నాలు చోటు,ేసుకున్నాయి. టిడిపి, దళిత సంఘాల నాయకులు ఓ వైపు, వైసిపి నాయకులు మరోవైపు ధర్నాకు దిగి కాస్త ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీసు స్టేషన్ వద్ద హైడ్రామా, ఉద్రిక్తత నెలకొంది. రోజా వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసిన సీఐ, ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నగరి ఎమ్మెల్యే రోజా ధర్నా చేశారు.  తనపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె ఆరోపించారు.  మరో వైపు దళితులను ఎమ్మెల్యే రోజా అవమానించారంటూ  స్థానిక టీడీపీ నేతలు పుత్తూరు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

 చిత్తూరు జిల్లా పుత్తూరు ఎంపీపీ మాధవయ్య వైఖరిని నిరసిస్తు ధర్నాకు దిగిన నగరి ఎమ్మెల్యే రోజా  అక్కడే ఉన్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఉద్దేశించి దగ్గరకు రావలసిందిగా రోజా పిలవగా.. ఆయన, అక్కడే నిలబడి ‘చెప్పండి మేడమ్‌’ అన్నారు. దీంతో రోజా ఆగ్రహంగా.. మేమేమీ ఎస్సీ ఎస్టీలం కాదు, దగ్గరకు రండి అన్నారు. ఆ వ్యాఖ్యలు వినగానే.. అక్కడే ఉన్న దళితులు, టీడీపీ నేతలు కోపోద్రిక్తులయ్యారు. ఆమె ప్రసంగానికి అడ్డుతగిలి ‘రోజా డౌన్‌ డౌన్‌, దళిత ద్రోహి రోజా’ అంటూ ఆగ్రహంగా నినాదాలు చేశా రు. ఎంపీడీవో కార్యాలయం నుంచి రోజాను వెళ్లనీయకుండా ఆమె వాహనాన్ని అడ్డుకుని క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. అయితే రోజా వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడటమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మరి రోజా వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందో.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  roja  sc  sts  dharna  chittur  mpp  case  police  puttur  

Other Articles