Highcourt | Judgement | Encounter

Ap high court order to file nurder case on police who participate in chittur encounter

High court, encounter, ap, tamilnadu, fire, police, dgp, ramudu

ap high court order to file nurder case on police who participate in chittur encounter. The High court judge clear that the repost submitted by the police is not satisfied. So need to submittee full report to the court ordered.

ఎన్ కౌంటర్ కాదు మర్డర్ కేస్ నమోదు చెయ్యండి: హైకోర్ట్

Posted: 04/10/2015 04:25 PM IST
Ap high court order to file nurder case on police who participate in chittur encounter

శేషాచలం అడవుల్లో జరిగిన 20 మంది కూలీల ఎన్ కౌంటర్ ఘటనను హత్యకేసుగా నమోదు చేయాలని హైకోర్టు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ ఎన్ కౌంటర్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఎదురు కాల్పుల్లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేశారా అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. పోలీసు నివేదిక స్పష్టంగా లేదన్న హైకోర్టు, పూర్తి వివరాలతో మరోసారి నివేదిక సమర్పించాలని డిజిపీని ఆదేశించింది. ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక మృతి చెందినవారికి వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించింది.  

ఎర్రచందనం కోసం అడవిలోకి వచ్చిన కూలీలు కరడుగట్టిన స్మగ్లర్లు అని ఏపి డిజిపి రాముడు హైకోర్టుకు వివరించారు. గతంలోనే స్మగ్లర్లకు హెచ్చరికలు జారీ చేశామనీ, కానీ వాటిని పట్టించుకోకుండా వారు అడవిలో యధేచ్ఛగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో కూలీలు పోలీసులపై రాళ్లు రువ్వడమే కాకుండా గొడ్డళ్లతో దాడులకు దిగారని డిజిపి కోర్టుకు తెలిపారు. అడవిలొ ఏర్పాటు చేసిన కెమెరాల్లో వీడియో పుటేజ్ లు కూడా సాక్షంగా ఉన్నయని వెల్లడించారు. తప్పని సరి పరిస్థితిలో పోలీసులు స్మగ్లరలపై కాల్పులు జరిపారని డిజిపి హైకోర్టుకు నివేదించారు. తమిళనాట ఆందోళనలు అంతకంతకూ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అయితే ఎన్ కౌంటర్ పై తమిళనాడు ముఖ్యమంత్రికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశాడు. కానీ ఆందోళనలు మాత్రం చల్లారలేదు. చిత్తూరు కలెక్టరేట్  ను ముట్టడించాలని తమిళులకు వైగో పిలుపునివ్వడం తర్వాత అతన్ని అరెస్ట్ చెయ్యడం టకటకా జరిగిపోయాయి. మరి హైకోర్ట్ రేపు ఎలాంటి తీర్పును వెల్లడిస్తుందో అని అటు తమిళులు, ఏపి పోలీసులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  encounter  ap  tamilnadu  fire  police  dgp  ramudu  

Other Articles