Modi | Facebook | Likes | Slip

Modi facebook lost likes a number of one lakh

modi, facebook, likes, slip, Land Acquisition Bill.,gharwapasi, narendramodi

Over a lakh 'like' lost on Facebook, and it's a virtual reality that Prime Minister Narendra Modi can link with the controversial Land Acquisition Bill. In just a matter of weeks, the prime minister's popularity on the social media site Facebook has taken a dip - from 2.8 crore 'likes' in March to roughly 2.78 crore as on April 7.

మోదీ 'ఫేస్' వాల్యు తగ్గిందా.. ఫేస్ బుక్ లో అన్ లైక్ లు పెరిగాయి..

Posted: 04/10/2015 09:38 AM IST
Modi facebook lost likes a number of one lakh

నెట్టింట్లో మోదీ హవా గురించి అందరికీ తెలుసు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫాలోవర్స్ అతని సొంతం. ఏ రాజకీయ నాయకుడికి లేనంత క్రేజ్ మోదీ సొంతం. అయితే ప్రధాని మోదీకి కొంతకాలంగా మద్దతు పలుకుతూ వస్తున్న ఫేస్‌బుక్‌ వినియోగదారులు.. ఒక్కసారిగా ఆయనకు షాక్‌ ఇచ్చారు. దాదాపు లక్షమంది ఫేస్‌బుక్‌ యూజర్లు మోదీ ఫేస్‌బుక్‌ పేజీని అన్‌లైక్‌ చేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు, వివాదాస్పద భూసేకరణ బిల్లుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. అన్‌లైక్స్‌ రూపంలో తమ అసంతృప్తి తెలిపారు. మార్చి నెలాఖరు వరకు 2.79 కోట్ల మంది మోదీ ఫేస్‌బుక్‌ పేజీని లైక్‌ చేసేవారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన భూసేకరణ బిల్లుకు సవరణలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఏప్రిల్‌ 7నాటికి మోదీ ఫేస్‌బుక్‌ పేజీని లైక్‌ చేసేవారి సం ఖ్య 2.78 కోట్లకు పడిపోయింది. దీనిపై బీజే పీ నేషనల్‌ కమ్యూనికేషన్‌ సెల్‌ కన్వీనర్‌ అ రవింద్‌గుప్తా స్పందించారు. ‘‘ఇది మాపై ఎలాంటి ప్రభావం చూపబోదు. టెక్నికల్‌ సమస్య లేదా.. ఫేస్‌బుక్‌ చేపట్టే క్లీన్‌నెస్‌ డ్రైవ్‌ వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అన్నారు. కాగా, లక్షమంది ‘అన్‌లైక్‌’ చేసినా ఇప్పటికీ ఎక్కువ మంది ఫాలోయర్స్‌ కలిగిన నేతల్లో మోదీ తొలి వరుసలోనే ఉన్నారు.

modiunlikes

నరేంద్ర మోదీ ఫేస్ బుక్ కు జులై 13, 2013లో 24 లక్షల లైక్ లు మార్చ్ 13,2014 నాటికి 1.13 కోట్ల లైక్ లు, మే 15, 2014 నాటికి 1.56 కోట్లు, సెప్టెంబర్ 4, 2014 నాటికి 2.10 కోట్లు, అక్టోబర్ 26,2014 నాడు 2.36కోట్లు, జనవరి 7,2015 2.67 కోట్లు, మార్చ్ 6,2015 నాటికి 2.79 లైక్ లు, మార్చి 13, 2015 నాటికి 2.79 లైక్ లే కొనసాగాయి. ఏప్రిల్ 7, 2015 నాటికి 2.78కి పడిపోయాయి.  అలా మోదీ కి ఒక్క సారిగా లక్ష మంది అన్ లైక్ చేశారు. అయితే ఘర్ వాపసీ, ల్యాండ్ యాక్వీజీషన్ బిల్ వల్ల మోదీ ప్రభుత్వానికి అపకీర్తి వస్తోందని గత కొంత కాలంగా మీడియా లో వస్తున్న వార్తలు నిజమయ్యాయి. మరి బిజెపి నాయకులు అంటున్నట్లు మోదీ అన్ లైక్ లు టెక్నికల్ లోపమో లేక ఎన్డీయే ప్రభుత్వ లోపమో తెలియాలి.

(Surce: IndiaToday)

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  facebook  likes  slip  Land Acquisition Bill.  gharwapasi  narendramodi  

Other Articles