అడగందే అమ్మైనా పాలివ్వదు.. అలాగే డబ్బులేనిదే ఏ వస్తువు కొనుగోలు చేయలేం.. కానీ ఓ టెంపరరీ ఉద్యోగి మాత్రం తన జేబు నుంచి ఒక్క రూపాయి తీయకుండానే రెండు నెలలకాలంలో 21 విమానాల్లో 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 13 దేశాలను ఉచితంగా సందర్శించాడు. ఏంటి..? అదెలా సాధ్యమవుతుంది..? అనేగా మీ సందేహం! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
మెక్సికోలో టెంపరరీ ఉద్యోగం చేస్తున్న అమెరికా జాతీయుడు-రచయిత 28 ఏళ్ల స్కాట్ కేయస్.. వివిధ విమాన సర్వీసులు ప్రవేశపెట్టిన పోటీల్లోనూ, క్రెడిట్ కార్డులపై పాయింట్లను జమ చేయడం అలవాటుంది. ఎప్పటినుంచో ఈ రెండు విభాగాల్లో పాలుపంచుకుంటూ వస్తున్న ఈ రచయితకు అవి జాక్ పాట్ ని తెచ్చిపెట్టాయి. జాక్ పాట్ అంటే లక్షల డబ్బులు పొందినట్లు కాదు.. విమాన సర్వీసులు అందించిన స్కీములు, 25 క్రిడిట్ కార్డులపై వచ్చిన పాయింట్ల నేపథ్యంలో ఫ్రీగా ప్రయాణించే అవకాశం లభించింది.
అంతే! మనోడు చకచకా తనకు కావాల్సిన సౌకర్యాలన్నింటిని తయారుచేసుకుని.. ప్రపంచదేశాలను చుట్టుముట్టడానికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే ఇతగాడు ఉచితంగా 21 విమానాల్లో 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 13 దేశాలను సందర్శించినట్లు పలు ఆంగ్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపాడు. తన ఈ ప్రయాణంలో మెక్సికో, నికరాగువా, ట్రినిడాడ్, సెయింట్ లూయీస్, గ్రెనడా, జర్మనీ, చెక్ రిపబ్లిక్, యుక్రెయిన్, బల్గేరియా, గ్రీస్, మెసెడోనియా, లూథియాన, ఫిన్‌లాండ్ దేశాలను సందర్శించానని అతడు పేర్కొన్నాడు.
అంతేకాదు.. అన్ని దేశాల్లోనూ విమానయాన సంస్థల ద్వారా ఉచిత భోజనం, లగ్జరీ వసతి, వై-ఫై సౌకర్యాలను సద్వినియోగం చేసుకున్నానని చెప్పాడు. విమాన సర్వీసుల మధ్య విరామ సమయాన్ని బట్టి ఆయా దేశాల్లో సైట్ సీయింగ్‌కు వెళ్లానని, వాటికి కూడా తక్కువే ఖర్చుపెట్టానని, మొత్తం టూర్‌లో ఎక్కడ బయట బస చేయలేదని, విమానయాన సంస్థలు కేటాయించిన హోటళ్లలోనే గడిపానని అతగాడు చెప్పుకొచ్చాడు. కొన్ని దేశాల్లో 'స్పా' సర్వీసులను కూడా అద్భుతంగా ఆనందించానని చెప్పారు.
తన మొత్తం టూర్‌ను ప్లాన్ చేసుకోవడానికి తనకు 10-12 గంటల సమయం పట్టిందని, తన తదుపరి పర్యటనలో 42 దేశాలు సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదిలావుండగా.. తాను చేసిన ఈ ప్రయాణానికి సంబంధించి.. 'హౌ టు ఫ్లై ఫర్ ఫ్రీ, హౌ టూ ఫైండ్ చీప్ ఫ్లైట్' అనే పేరిట పుస్తకాలు రాస్తున్నానని తెలిపాడు. వాటిలో తాను ఎలా టూర్‌లు ప్లాన్ చేసిందీ పూర్తిగా వివరిస్తానని స్పష్టం చేశాడు. త్వరలోనే వాటిని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నానని కూడా పేర్కొన్నాడు.
ఇక చివరగా.. విమాన సర్వీసుల స్కీములను, క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే పాయింట్లపై సరైన అవగాహన ఏర్పరుచుకొని వాటిని సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎవరైనా తనలా ఉచితంగా ప్రపంచాన్ని చుట్టి రావచ్చని ప్రతిఒక్కరికి ఉచిత సలహా ఇచ్చాడు కూడా!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more