Satyam | Ramalingaraju | Punishment | Activity

Satyam ramalingaraju requested to cbi court judge to decrease punishment

ramalingaraju, 108, 104, naandi, bairraju, socialactivity, court, judge, punishment, satyam, case,

satyam ramalingaraju requested to cbi court judge to decrease punishment. satyam ramalaingaraju told the judge about his social activitys. previously ramalinga raju sponcered 108, 104 and some more.

జడ్జిగారూ.. మంచి పనులు చేశాను కాబట్టి క్షమించండి: రామలింగరాజు

Posted: 04/09/2015 01:08 PM IST
Satyam ramalingaraju requested to cbi court judge to decrease punishment

వంద పీనుగలను తిన్న రాబందు ఒక్క గాలి వానకు కూలక తప్పదు. ఇప్పుడు సత్యం కేసులో రామలింగరాజు పరిస్థితి కూడా ఇలానే ఉంది. దేశంలో టాప్ కంపెనీగా ఎదిగింది అనుకున్న సత్యం.. పునాదులతో సహా కదిలిపోయింది. సత్యాన్ని నమ్మిన వారు లబోదిబోమంటూ నెత్తినోరు కొట్టుకున్నారు. అయితే తాజాగా సిబిఐ కోర్ట్ సత్యం కేసులో రామలింగరాజుతొ సహా మరో తొమ్మిది మందిని దోషులుగా తేల్చింది.  సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు తుదితీర్పు వెల్లడించిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ...దోషులతో విడి విడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రామలింగరాజు అరగంట పాటు సుదీర్ఘంగా న్యాయమూర్తితో తన   కేసు పరిస్థితిని విన్నవించుకున్నారు.  తనను క్షమించాలని కోరుతూ ఆయన న్యాయమూర్తికి నాలుగు పేజీల లేఖను సమర్పించారు. ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని రామలింగరాజు ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపినట్లు సమాచారం.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తాను ఎన్నో సేవలు చేశానని రామలింగరాజు వెల్లడించారు. అత్యవసర చికిత్సను అందించే 108 వాహనాలు, గ్రామాల్లో వారికి వైద్య సేవలు అందించే 104 వాహనాలు, భైర్రాజు ఫౌండేషన్ , నాంది ఫౌండేషన్ల ద్వారా సమాజానికి ఎంతో సేవ చేశానని రామలింగరాజు న్యాయమూర్తి ముందు చెప్పుకొచ్చారు.  తాను చేసిన సేవా కార్యక్రమాలను పక్క రాష్ట్రాలు కూడా అమలు చేశాయని ఆయన తెలిపారు. తాను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశానని, కాబట్టి శిక్ష తగ్గించాలని రామలింగరాజు కోరారు. వయోవృద్దులైన తన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత తన మీద ఉందని కాబట్టి శిక్ష ను తగ్గించాలని రామలింగరాజు న్యాయమూర్తిని కోరారు.

 

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramalingaraju  108  104  naandi  bairraju  socialactivity  court  judge  punishment  satyam  case  

Other Articles