Satyam | jailed | Court | CBI

Raju and nine others on charges of criminal conspiracy and cheating the quantum of sentence will be pronounced on friday

cheating, satyam, scam, court, cbi, ramalingaraju,

All 10 accused including Satyam founder B Ramalinga Raju were on Thursday found guilty by a special court in Hyderabad in the multi- crore accounting fraud case. The special court convicted Raju and nine others on charges of criminal conspiracy and cheating. The quantum of sentence will be pronounced on Friday.

సత్యం కేసులో రేపు శిక్ష ఖరారయ్యే అవకాశం

Posted: 04/09/2015 12:36 PM IST
Raju and nine others on charges of criminal conspiracy and cheating the quantum of sentence will be pronounced on friday

సత్యం కుంభకోణంలో నేరం రుజువైంది. సాక్షాధారాలతో సహా నేరం నిరూపణ అయిందని కోర్ట్ పేర్కొంది. అయితే రామలింగరాజుకు ఎంత కాలం శిక్ష పడుతుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. కొంత మంది న్యాయవాదులు ఏకంగా ఏడు సంవత్సరాలు శిక్ష పడుతుందని భావిస్తుంటే, కొంత మంది మాత్రం అంతకన్నా ఎక్కువే పడుతుందని భావిస్తున్నారు. సత్యం రామలింగరాజు కేసులో మూడేళ్లకు మించి శిక్ష పడితే బెయిల్ దొరుకే అవకాశం ఉండదని, మూడేళ్ల లోపు శిక్ష పడితే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ కేసు తీర్పు ను వెలువరించిన న్యాయమూర్తి దీనిపై శిక్షను రేపు వెల్లడించవచ్చని భావిస్తున్నారు.

ఒకసారి దోషి అని న్యాయమూర్తి ప్రకటించిన తర్వాత దోషులను పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం ఉంటుందని,అది కూడా జడ్జి విచక్షణను బట్టి ఉంటుందని అన్నారు. తీర్పు తర్వాత దోషులుగా నిర్ధారణ అయినవారి వాదనలు వింటారని, దానిని బట్టి కేసులో శిక్షలు వేయవచ్చని అన్నారు. హత్య వంటి కేసులలో శిక్షలు పడితే బెయిల్ రావడం కష్టమని, ఇలాంటి కేసులలో బెయిల్ వచ్చే అవకాశం ఉందని, కింది కోర్టులో రాకపోయినా, పైకోర్టులకు వెళ్లే వీలు కూడా ఉంటుందని వారు చెప్పారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రామలింగరాజును దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.  రామలింగరాజు సహా పదిమందిపై నేరం రుజువైంది. మరోవైపు దోషులకు శిక్షలపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.  కాగా ఈ కేసులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి 46 పేజల తీర్పును చదివి వినిపించారు. దోషులకు గరిష్టంగా ఏడేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheating  satyam  scam  court  cbi  ramalingaraju  

Other Articles