Surabhia | Seize | Secbed | Forest

Forest officials seize the surabhi garden at secunderbad

garden, seize, forest, peaocock, secbad, arrest, animals

forest officials seize the surabhi garden at secunderbad. The surabhi garden owners violate forest animal law and haveing peococks in surabhi garden. forest officials seaize the garden.

సురభి గార్డెన్ సీజ్.. వన్య ప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన

Posted: 04/09/2015 11:24 AM IST
Forest officials seize the surabhi garden at secunderbad

అది పేరుకే ఫంక్షన్ హాల్ కానీ చట్టానికి వ్యతిరేకంగా చాలానే జరుగుతాయి. ఎక్కడో మారు మూల కూడా కాదు హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న సికింద్రాబాద్ లో ఓ గార్డెన్ అసలు రంగును అటవీ అధికారులు బయటపెట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని సురభి గార్డెన్స్లో అటవీశాఖ అధికారులు  సోదాలు నిర్వహించారు. చట్ట విరుద్ధంగా జాతీయ పక్షి నెమలి సహా పలు వన్యప్రాణులను పెంచుతున్నట్లు పక్కా సమాచారం అందటంతో పోలీసుల సాయంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. భూ ఆక్రమణలు సహా పలు అక్రమాలకు సురభి గార్డెన్స్ యాజమాన్యం పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా బుధవారం రాత్రే సురభి గార్డెన్స్లో కంటోన్మెంట్ అధికారులు సీజ్ చేశారు.  అలాగే వైల్డ్లైఫ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ సురభి గార్డెన్ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా వన్య ప్రాణులను పెంచుతోంది. నెమలి లాంటి వన్య ప్రాణులను పెంచుతున్న సురభి గార్డెన్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవలని వన్య ప్రాణి సంరక్షణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : garden  seize  forest  peaocock  secbad  arrest  animals  

Other Articles