Nara Lokesh leaked photos - is there any issue?

Leaked tdp leader lokesh personal photos what is wrong or what is the issue

Nara Lokesh, Lokesh Photos, TDP Photos,

Nara Lokesh photos with friends partying are leaked and shown as if a big crime is committed by Lokesh!!

లోకేష్ ఫోటోలు - అసలు ప్రశ్న ఏమిటి బాబులు?

Posted: 04/09/2015 01:46 AM IST
Leaked tdp leader lokesh personal photos what is wrong or what is the issue

నారా లోకేష్.. అమెరికాలోని స్నేహితులతో కలసి తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆ ఫొటోలే దర్శనమిస్తున్నాయి.

'ఈ ఫొటోల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఏం వివరణ ఇస్తుంది.?' అంటూ పెద్ద న్యూస్ ఐటమ్స్.అసలు ఈ ఫోటో లు ఎప్పటివి అని పక్కనపెడితే, ఫోటో లు చూస్తే, ఈ ఫోటో లలో ఏమిటి అంత తప్పు అనే పెద్ద ప్రశ్న వచ్చింది మరి.. , 

అసలు ఈ ఫోటో లు ఇప్పటివా?. ఎప్పటివి అని పక్కనపెడితే, ఫోటో లు చూస్తే, ఈ ఫోటో లలో ఏమిటి అంత తప్పు , తెలుగు దేశం పార్టీ లెవెల్ లో సమాధానం ఇవ్వాలి అని అడగటానికి? అసలు ఏదో పెద్ద నేరం చేస్తే ఈ ఫోటోలు ఏవో ప్రూఫ్ వదిలినట్టు ఈ వ్యాసాలు ఏమిటి?

అమెరికా లో స్విమ్మింగ్ పూల్స్ వున్న ఇళ్ళల్లో గాని, స్విమ్మింగ్ పూల్ హోటల్స్ లో గాని ఫ్రెండ్స్ అంత కలిసి స్విమ్ చెయ్యటం వొక సామన్యమైన విషయం కదా? అంత ప్రాముఖ్యత వుందా? లేక పోతే లోకేష్ కాబట్టి ఎవరితో స్విమ్మింగ్ పూల్ లోకే దిగ కూడదు అది మగ స్నేహితులతోనే స్విమ్ చెయ్యాలి అనే రూల్ ఎమన్నా ఉన్నాయా? అసలు అంత తప్పేమిటి?

ఇక ఇంకో ఫోటో లో ఫ్రెండ్స్ తో టేబుల్ మీద వైన్ గ్లాస్ వుంది? ఫ్రెండ్స్ తో బయటకి రెస్తౌరంత్ కి వెళితే ఫ్రెండ్స్ వైట్ వైన్ తాగితే ఇంకా అంత చెడి పోయి , వక్తిత్వం కోల్పోయినట్టెన ?

సరే, ప్రజా జీవితంలోకి వచ్చాక, ప్రశ్నలు తప్పవు.. వాటికి సమాధానం చెప్పకా తప్పదు.! అంటున్నారు? అసలు " ప్రశ్న" ఏంటి బాబు ? ఫోటో లు ఎందుకీ దిగావనా ? లేక పోతే మీ ఫ్రెండ్స్ ఎవరు అనా? లేకపోతే ఏమిటీ పశ్న అసలు?

ఇంతకీ, ఈ వ్యవహారమంతా ఏదో నీలి చిత్రాల ఫోటో లు దొరికినట్టు, కొండని తవ్వి ఎలికిని పట్టినట్టు పుంఖాల పుంఖాల గ పెద్ద న్యూస్ ఐటమ్స్ రాసేస్తున్నారు ..ఇలా ఏదో పనికిరాని పుకార్లు కల్పించే బదులు పనికి వచ్చే న్యూస్ రాస్తే బవున్తున్దెమొ.. ఏదైనా మనసులో మాట రాయకుండా ఉండ లెకపొతున్నాము.. ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(5 votes)
Tags : Nara Lokesh  TDP  

Other Articles