ahead of rahul gandhis return digvijaya singh Questions Timing Of Leave

Digvijay singh questions timing of rahul gandhi s leave

Digvijay Singh Questions Timing Of Rahul Gandhi's Leave, congress party general secrataty digvijay singh, AICC working President Rahul gandhi, AICC president sonia gandhi, Rahul Gandhi leave, digvijay singh on rahul gandhi leave, dig vijay singh on rahul timing of leave

ahead of rahul gandhis return on 12th april, digvijaya singh says timing of his long leave was wrong

రాహుల్ గాంధీ సుధీర్ఘ సెలపుపై దిగ్వజయ్ పెదవి విరుపు

Posted: 04/05/2015 03:16 PM IST
Digvijay singh questions timing of rahul gandhi s leave

కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఎట్టకేలకు యువరాజు రాహుల్ గాంధీ సుదీర్ఘ సెలవుపై స్పందించారు. నిత్యం రాజకీయాలలో తనమునకలై.. పార్టీ కోసం తపించిన రాహుల్ గాంధీ కొన్ని రోజుల పాటు సెలవు తీసుకోవడంలో తప్పేమీ లేదని అన్నారు. అయితే ఇలా అంటూనే దీర్ఘకాలం సెలవు తీసుకోవడంపై ఆయన పెదవి విరిచారు. తీసుకున్న సెలవుకు మరిన్ని రోజులు సెలవును పొడగించి తప్పు చేశారని సంచలన ప్రకటన చేసారు. ఓ టెలివిజన్ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసారు.
 
గాంధీ కుటుంబానికి నమ్మినబంటులా మెలిగే డిగ్గీ రాజా ఏకంగా రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. స్వయంగా డిగ్గీ రాజాయే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకునపడింది. ఇప్పటికే రాహుల్ సెలవులపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా ఇప్పుడు దిగ్విజయ్ వ్యాఖ్యలు కూడా వాటికి ఊతమిచ్చేలా ఉన్నాయి. ఐతే ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీ రాగానే కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే సోనియా గాంధీ కూడా పార్టీకి దూరం కారాదని కోరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Digvijay Singh  Rahul Gandhi  Leave  Congress  politics  

Other Articles