Burglar in Siberia leaves his photo, apology note for breaking-in

Burglar in siberia leaves his photo apology note for breaking in

Burglar in Siberia, Burglar leaves his photo apology note for breaking-in, burglar in a small town in Siberia, Siberia, Moscow, Burglar, Aplology note, photograph

A burglar in a small town in Siberia has broken into a house and left his photograph with a note of apology.

మీ ఇంట్లో చోరికి పాల్పడింద నేనే.. క్షమించరూ ప్లీజ్..!

Posted: 04/04/2015 07:48 PM IST
Burglar in siberia leaves his photo apology note for breaking in

శీర్షక చూసి పాపం. అతను మంచి దోంగ అనుకుంటున్నారా..? ఎదో గత్యంతరం లేని పరిస్థితుల్లో దోంగతనానికి వెళ్లాడనుకుంటా అని భావిస్తున్నారా..? అయితే మీరు పర్సులో చేయిసినట్టే. ఎందుకంటారా అతనేమంత మంచి దోంగ కాదు. దొంగతనాలు చేయడం అతనికి అలవాటు. దొంగతనాలు చేయడమే చెడు పని, అదీ మరోకరి ఇంటి తలుపులు బద్దలు కోట్టి లోనికి చోరబడటం మరో తప్పు చేయడం.. వారు కష్టపడి సంపాదించుకున్నదంతా దోచుకుపోడవం మంచి ఎలా అవుతుంది..? ఇన్నాళ్లు ఎక్కడోక్కడో చోరీలు చేసిన ఈ దోంగ చివరకు తమ వీధిలోని వారి ఇంటినే దొంగలించడం ఎలా కరెక్టు.. ఉపోద్ఘాతం అంతా వద్దు.. విషయంలోకి వెళ్థాం..

మాస్కో పట్టణానికి 3వేల 100 కిలోమీటర్ల దూరంలో వున్న సైబిరాయి ప్రాంతంలోని ఓ చిన్న పట్టణంలో ఓ దోంగ తమ వీధిలోని తాళం వేసి వున్న ఇంటిలోకి తాళం బద్దలు కోట్టి చోరబడ్డాడు. ఒక చైను, సిగరెట్ ప్యాకెట్లు ఇత్యాదులు తీసుకుని.. వెళ్తూ.. వెళ్తూ.. ఈ రోజు మీ ఇంట్లో చోరబడి తన పబ్బం గడించిందని, ఇలాంటి పని చేయడానికి తాను సిగ్గుపడుతున్నట్లు తనను క్షమించాలంటూ ఓ చిన్నపాటి క్షఃమాపణ ఉత్తరాన్ని తన ఫోటోపై రాసి తానే దొంగతనానికి పాల్పడ్డానని చెప్పాడు.

ఇంట్లో సామన్లు తస్కరణకు గురికావడంతో ఇంటి యజమాని పోలీసులకు పిర్యాదు చేసి.. తనకు లభించిన దోంగ ఫోటోను, దాని వెనకనున్న వివరణను కూడా పోలీసులకు అందజేశాడు. ఫోటో అధారంగా 26 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను అప్పటికే పలు దోంగతనం కేసులలో నిందితుడని తేల్చారు. అయితే నిందితుడు ఎప్పుడెప్పుడు దోంగతనాలకు పాల్పడ్డారన్న విసయాలను మాత్రం వెల్లడించలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siberia  Burglar  Aplology note  photograph  

Other Articles