Secretariate | Telangana | Erragadda

Telangana govt order to remove the chest hospital and some more hospital at erragadda of hyderabad

telangana, secretariate, Go, kcr, erragadda, chest hospital, ayurveda hospital,

telangana govt order to remove the chest hospital and some more hospital at erragadda of hyderabad. for new constructing telangana secretariate, the telangana govt passed a GO for moving chest hospital and ayurveda hospital, drug control administration etc.

ఛెస్ట్ ఆస్పత్రితో పాటు అన్నింటిని తరలిస్తున్నారహో...

Posted: 04/04/2015 09:16 AM IST
Telangana govt order to remove the chest hospital and some more hospital at erragadda of hyderabad

ఎర్రగడ్డలో ఛెస్ట్ ఆస్పత్రి స్థానంలో కొత్తగా తెలంగాణ సెక్రటేరియట్ నిర్మించనున్న విషయం తెలిసిందే. అయితే సెక్రటేరియట్ నిర్మానం కోసం ఛెస్ట్ ఆస్పత్రితో పాటు ఆ పక్కనే ఉన్న మానసిక చికిత్సాలయం, ఆయుర్వేద ఆస్పత్రితోపాటు, ఇతర వైద్య సంస్థలనూ వేరే చోటికి తరలించనున్నారు. దీనిపై మార్చి 24న జీవో వెలువడింది. కొత్త సచివాలయం కోసం ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్‌ సమీపంలోని అనంతగిరికి తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారు. చెస్ట్‌ ఆస్పత్రి తరలింపుతోపాటే మానసిక చికిత్సాలయాన్ని కూడా తరలించాలని ప్రభుత్వం గతంలో భావించింది. అయితే... చెస్ట్‌ ఆస్పత్రి తరలింపుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తొలి జీవోలో ఇతర ఆస్పత్రులు, సంస్థల తరలింపు గురించి ప్రస్తావించలేదు. మార్చి 24వ తేదీన విడుదల చేసిన జీవోలో మిగిలిన వాటి గురించి ప్రభుత్వం పేర్కొంది.  55 ఎకరాలున్న మానసిక ఆస్పత్రి స్థలంలో ఐఏఎస్‌ క్వార్టర్స్‌ నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక్కడ ఐఏఎస్‌లకు ఇండిపెండెంట్‌ ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నారు. ఆయుర్వేద ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిసేట్రషన్‌ స్థలాల్లో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తారు. చెస్ట్‌ ఆస్పత్రిని ఆనుకునే ఉన్న అత్యాధునిక వసతులతో కూడిన క్షయ పరీక్ష కేంద్రాన్ని కూడా తరలించనున్నారు.

తెలంగాణ కొత్త సచివాలయాన్ని 72 ఎకరాల్లో నిర్మించనున్నారు. సీఎం ఆఫీసు, సీఎంవో కార్యాలయం, మంత్రుల కార్యాలయాలు, వారికి సంబంధించిన పరిపాలన విభాగాలు, విభాగాల ఉన్నతాధికారుల ఆఫీసులను నిర్మిస్తారు. సంజీవరెడ్డి నగర్‌ నుంచి అటు ఎర్రగడ్డ, ఇటు ఏజీ కాలనీ రోడ్డు వరకు సచివాలయ నిర్మాణం జరగనుంది. ఆయుర్వేద ఆస్పత్రి, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం మధ్యలో ఏజీ కాలనీకి వెళ్లే రోడ్డు కూడా ఉంది. ఈ రోడ్డును కూడా సచివాలయం, ఐఏఎస్‌ క్వార్టర్స్‌ల్లో కలిపే అవకాశాలు ఉన్నాయి. రోడ్డును అలాగే వదిలేసినా... ఈ మార్గంలో రాకపోకలను నిషేధిస్తారని తెలుస్తోంది.  కాగా, ఇన్ని కార్యాలయాలను తరలిస్తున్నప్పటికీ... వాటికి సంబంధించిన అధికారులకు, సిబ్బందికి ప్రభుత్వం ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు. మొత్తానికి ప్రభుత్వం అనుకున్న విధంగా అన్నింటిని తరలించి, అక్కడ తెలంగాణ సెక్రటేరియేట్ ను నిర్మించడానికి సన్నాహాలు అన్నీ పూర్తయ్యాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  secretariate  Go  kcr  erragadda  chest hospital  ayurveda hospital  

Other Articles