MGNREGS | UPA | NDA

Mahatma gandhi national rural employeement guarante scheme has the power to change the nation

nregs, employeement, guarantee, gandhi, upa, nda, rural, kooli,

mahatma gandhi national rural employeement guarante scheme has the power to change the nation. in 2005 the upa govt propose the mgnregs for the farmer kooli boosting.

ప్రత్యేకం: భారత చిత్రాన్ని మార్చే శక్తి 'ఉపాధి హామీ' సొంతం

Posted: 04/03/2015 04:38 PM IST
Mahatma gandhi national rural employeement guarante scheme has the power to change the nation

గ్రామీణ ప్రాంత నిరుపేద కూలీల కడుపు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. 2005లో భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ఫథకం భవిష్యత్ లో ఎన్నో మార్పులు తీసుకు వస్తుందని ఆశించారు. 2015-16 సంవత్సరానికి గాను ఈ పథకం కింద కేంద్రం 33వేల 7వందల కోట్ల రూపాయలను కేటాయించింది. దేశవ్యాప్తంగా 648 జిల్లాలు, 2లక్షల 48 వేల 329 గ్రామ పంచాయితీల్లో ఈ పథకం అమలులోకి వచ్చింది. ముందు ఏడాదికి వంద రోజుల పాటు ఉపాధికి ప్రభుత్వం హామీ ఇస్తే, తరువాత దాన్ని 120 రోజులకు పెంచారు. వేతానాలను కూడా ముందు వంద రూపాయల నుండి 169 రూపాయలకు పెంచారు.

అయితే భారతదేశంలో ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా మన వాళ్లు ఆరంభ శూరత్వాన్ని చూపిస్తారన్నది అందిరికి తెలిసిన నిజం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా అదే కోవలో చేరింది. ఈ పథకం కింద జాబ్ కార్డులు జారీ చేసి, జాబ్ హోల్డర్స్ ఈ దీంతో జాబ్‌కార్డు తీసుకున్న ప్రతీ కుటుంబానికి ఏటా 100 రోజుల పని కల్పించాల్సి ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం సరాసరి 38 రోజుల పనిదినాలనే అధికారులు కల్పించారు. పనులను ముందుగా గుర్తించకపోవడం, గుర్తించిన పనులు చేపట్టడానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయకపోవడంతో ఉపాధి హామీ పనులు ముందుకు సాగట్లేదు. పనికోసం డిమాండ్ చేసే కూలీలకు గ్రామాల్లో క్షేత్ర సహాయకులు, మండలస్థాయి అధికారులు సరైన సమాధానం చెప్పకుండా పనులు లేవంటూ పంపించేస్తున్నారు.

ఉపాధి హామీ పనుల్లో ప్రస్తుతం నర్సరీ, మరుగుదొడ్ల నిర్మాణ పనులున్నా... అవి చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో డిమాండ్ మేరకు పనులు కల్పించలేక అధికారులు విఫలం అవుతున్నారు. ఈ ఏడాదిలో 10 లక్షల వరకు వివిధ రకాల పనులు చేపట్టినట్లు రికార్డుల్లో ఉన్నా 2.82 లక్షల పనులు పూర్తి చేసినట్లే చెబుతున్నారు. ఒక పంచాయతీ పరిధిలోని చిన్నచిన్న అనుబంధ గ్రామాలకు క్షేత్ర సహాయకులు లేకపోవడంతో ఆ గ్రామాల్లోని వారికి ఉపాధి హామీ చూపించేవారు లేకుండాపోయారు. సాధారణంగా క్షేత్ర సహాయకులు ఏ ప్రాంతంలో పనిచేయాలో చూపించడంతోపాటు కొలతలు ఇస్తే తప్ప.. కూలీలు పనిచేయడానికి వీల్లేని పరిస్థితి.తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం రూ. 1,568 కోట్ల మేరకు పనులు జరిగినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నా పనికి అవసరమైన మెటీరియల్‌తోపాటు కూలీలకు ఇప్పటి వరకు మొత్తం రూ. 1,028 కోట్లు చెల్లించినట్లు వివరించారు. జాబ్‌కార్డులున్న 54 లక్షల కుటుంబాల్లో కేవలం 1.23 లక్షల కుటుంబాలే 100 రోజుల పని పూర్తి చేయడం గమనార్హం.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భారత ఆర్థిక వ్యవస్థ రూపును మార్చివెయ్యడంతో పాటు, సామాజికంగానూ ఎంతో మేలు చేస్తుందని పరిశోధకుల గట్టి నమ్మకం. కానీ ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తున్న తీరులోనూ లోపాలున్నాయి. ఇక ఈ పథకం కింద కోట్ల రూపాయలు బొక్కేస్తున్న వారి గురించి రాసుకుంటూ పోతే గ్రంథాలే కావాలేమో. మరి అలాంటి అవినీతి చీడలు పథకాన్ని పట్టి పీడిస్తున్నంత కాలం పథకం లక్ష్యం నెరవేరదు. ఉపాధి కల్పించడం, ఉపాధి కి గ్యారంటీ కల్పించడం లాంటి రెండు ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలంటే ఇది ఖచ్చితంగా కావాలి.

యుపిఎ ప్రభుత్వం హయాంలో వచ్చిన ఈ పథకం ప్రారంభించిన తొలి సంవత్సరంలోనే అనుకోని విధంగా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. దాంతో ఆర్థిక వేత్తలు భారత స్వరూపాన్ని మార్చే కొత్ పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని ఎంతో గొప్పలు చెప్పుకున్నారు. కానీ తరువాత వారి మాటలు కేవలం కల్లలుగా మారాయి. పథకం స్వరూపంలో మార్పు లేకుండా ఫలితాలు మాత్రం మారిపోయాయి. కాగా యుపిఎ ప్రభుత్వం హయాంలో వచ్చింది కనుక తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం దీన్ని తీసివెయ్యడమో లేదా కనీసం పేరు మార్చడమో చేస్తుందని అనుకున్నా ఎన్డీయే ప్రభుత్వం అలాంటివి చెయ్యలేదు. పథకాన్ని ఇదే విధంగా కొనసాగిస్తున్నామని ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపడుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరిన్న మంచి ఫలితాలు రావాలంటే మాత్రం వ్యవస్థలో మార్పులు రావాలి. కూలీలకు నిజాయితీగా పనులు అప్పగించాలి. అన్నింటికి మించి పనులు చేసిన వెంటనే వారికి కూలీ చెల్లించాలి. అయితే కూలీ చెల్లించడంలో ఎంతో జాప్యం జరుగుతుంది. అందుకే కొంత మంది కూలీ పనులకు రాకుండా మానేస్తున్నారు. ఇక రాజకీయ అండదండలు ఉన్న వారి గురించి వేరే చెప్పనక్కర్లేదు. తమ వారి పేర్లు నమోదు చేసి పనులు చెయ్యకున్నా చేసినట్లు చూపి డబ్బులు దండుకుంటున్నారు. ఇలా ప్రతి స్థాయిలోనూ అవినీతి పెరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో పారదర్శకంగా అమలు చేస్తే కానీ నిరుపేద కూలీలకు మేలు జరగదు. పూర్తిగా దాని భారాన్ని కేంద్రంపై నెట్టకుండా రాష్ట్రాలు కూడా బాధ్యతగా వ్యవహరించి, పనులను సవ్యంగా జరిగేట్లు చూడాలి.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చూడాలి. జిల్లా స్థాయి అధికారులకు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించడంతో పాటు వారికి అన్ని రకాల అధికారలను కట్టబెట్టాలి. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూసుకోవాలి. మహిళలకు తగిన రక్షణ, గౌరవం ఇవ్వాలి. ఇలా అన్ని అనుకున్నట్లుగా జరిగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫలితాలు దేశ సగటు కూలీ జీవితాన్ని మార్చి వేస్తుంది. కూలీల జీవితాల్లో కొత్త వెలుగులు త్వరలోనే రావాలని ఆశిద్దాం..

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nregs  employeement  guarantee  gandhi  upa  nda  rural  kooli  

Other Articles