singapore corporate companies in andhra capital amaravathi | chandrababu naidu

Singapore corporate companies will enter in andhra capital amaravathi

ap capital city, ap capital city news, ap capital city amaravathi, ap capital amaravati, singapore coporate companies, singapore companies, chandrababu naidu, chandrababu eswaran news, amaravati plans, singapore ap capital plans, ap capital master plan

singapore corporate companies will enter in andhra capital amaravathi ; According to the government officials sources... The Famous corporate companies of singapore will enter soon in andhra pradesh capital city amaravathi after completion of city plans.

ఆంధ్రా ‘అమరావతి’లో కాలుమోపనున్న కార్పొరేట్లు

Posted: 04/03/2015 11:45 AM IST
Singapore corporate companies will enter in andhra capital amaravathi

ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును ‘అమరావతి’గా ఖరారు చేసినట్లుగా వెల్లడించిన విషయం తెలిసిందే! ఈ రాజధాని నిర్మాణానికి బాబు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతీ విదితమే! ఈ రాజధాని నిర్మాణంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్.. ఇప్పటికే మొదటి విడత ప్రణాళికను బాబుకు అందజేశారు. ఇక మిగిలిన రెండు దశల ప్రణాళికలు జూన్ నెలాఖరుకల్లా పూర్తి కానున్నాయి. ఆ రెండు ప్రణాళికలు పూర్తవడమే ఆలస్యం.. కార్పొరేట్ దిగ్గజాలు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

ఆయా కంపెనీలు రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్లు సింగపూర్‌ వాణిజ్య శాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ ‘మాస్టర్‌ప్లాన్ అందజేసిన’ సమయంలో స్పష్టం చేశారు కూడా! రాజధానికి సంబంధించి మిగిలిన రెండు దశల ప్రణాళికలు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని, సింగపూర్ కంపెనీలకు అవకాశం లభించే విధంగా ఏపీ ప్రభుత్వంతో కలసి ముందుకు వెళుతున్నామని ఆయన పేర్కొన్నారు. దీంతో రాజధానిలో దిగ్గజ కంపెనీలు దిగనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని సమాచారం!

ఇదిలావుండగా.. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ కార్పొరేట్ సంస్థలు తయారు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఐఈ-సింగపూర్ సంస్థ మాస్టర్‌ప్లాన్ తయారు చేయలేదు. ఆ మాస్టర్‌ప్లాన్ తయారు చేసే బాధ్యతను మరో రెండు కార్పొరేట్ సంస్థలకు ఐఈ అప్పగించింది. సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, జురాంగ్ కన్సల్టెంట్స్‌ల ద్వారా ఈ మాస్టర్‌ప్లాన్ తయారు చేయించినట్టు ఈశ్వరన్ స్వయంగా తెలియజేశారు. ఈ సంస్థలే సమీప భవిష్యత్తులో రాజధానిలో రంగప్రవేశం చేయనున్నాయని తెలుస్తోంది.
 
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కారిడార్లలోనూ దిగ్గజ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని అధికార వర్గాలు సమాచారం! పలు రంగాలకు చెందిన ఏడు అభివృద్ధి కారిడార్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కారిడార్లు ఏర్పాటయ్యే ప్రాంతాలు, రంగాలను మాస్టర్‌ప్లాన్‌లో నిర్దేశించారు. నూతన రాజధానిలో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వైపు రెండు అభివృద్ధి కారిడార్లను నెలకొల్పుతారు. వాటిల్లో నందిగామ కారిడార్‌లో ఫార్మా, బయోటెక్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ రంగాలను అభివృద్ధి చేస్తారు. గుడివాడ కారిడార్‌లో హరిత పరిశ్రమలు, అక్వా కల్చర్ రంగాలను అభివృద్ధి చేస్తారు.

అలాగే విశాఖ నుంచి చెన్నై వైపు మరో రెండు కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. దీనిలో గన్నవరం కారిడార్‌లో ఐటీ, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్/హార్డ్‌వేర్, ఆటోమోటివ్, ఏరోస్పేస్ రంగాలను అభివృద్ధి చేస్తారు. గుంటూరు కారిడార్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్స్, టెక్స్‌టైల్స్, నాన్ మెటాలిక్స్ ఉత్పత్తుల రంగాలను అభివృద్ధి చేస్తారు. ఇక తెనాలి కారిడార్‌లో లాజిస్టిక్స్, టూరిజం, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలను, సత్తెనపల్లి కారిడార్‌లో టూరిజం, నాలెడ్జ్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తారు. నూజివీడు కారిడార్‌లో వ్యవసాయ అధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తారు. వీటిలోనూ విదేశీ కార్పొరేట్ సంస్థలే రంగప్రవేశం చేయనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles