Saina into Malaysia Open quarterfinals, Malaysia Open Super Series Premier.

Saina nehwal storms into malaysia open quarterfinals

Saina Nehwal into Malaysia Open quarterfinals, Saina into Malaysia Open quarterfinals, ,Malaysia Open Super Series Premier., Xue Yao, Saina Nehwal, Malaysia Open, Chinese qualifier Xue Yao

Officially crowned the world no. 1 in the BWF rankings, Saina Nehwal on Thursday continued her rampaging run with a dominating straight-game win over Chinese qualifier Xue Yao to reach the quarterfinals of the Malaysia Open Super Series Premier.

మలేషియా ఓపెన్ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన సైనా

Posted: 04/02/2015 10:00 PM IST
Saina nehwal storms into malaysia open quarterfinals

ప్రపంచ బ్యాట్మింటన్ ఫెడరేషన్ ఇవాళ అధికారికంగా భారతీయ షెట్లర్ సంచలనం సైనా నేహ్వాల్ ను ప్రపంచ నెంబర్ వన్ గా ప్రకటించిన నేపథ్యంలో సైనా తన జోరును కోనసాగిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవలే ఇండియన్ ఓపెన్ టైటిల్ ను సాధించన సైనా తాజాగా మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ పైన్సల్స్ లోకి దూసుకెళ్లింది. ఏస్ షెట్లర్ సైనా.. తన నెంబర్ వన్ స్తాయికి తగ్గట్గుగా ఆటతీరును కనబరుస్తూ ముందుకు సాగుతోంది.

మహిళల సింగిల్స్ విభాగంలో చైనా క్వాలిఫయర్ ఝూ యావోతో జరిగిన పోరులో సైనా 21-13, 21-9 తో సునాయాసంగా నెగ్గింది. క్వార్టర్ ఫైనల్స్ లో సైనా చైనాకే చెందిన మరో క్రీడాకారిణి సున్ యుతో తలపడనుంది. మరోవైపు ఇదే టైటిల్ పోరులో పురుషుల విభాగం సింగిల్స్ లో పోరుపల్లి కశ్యప్ ఓటమి పాలయ్యారు. కశ్యప్ 10-21, 6-21 సోర్కుతో చైనా క్రీడాకారుడు చెన్ లాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాలా, అశ్వినీ పోన్నప్ప జోడి 23-21, 8-21, 17-21 స్కోరుతో ఇండోనేషియా జంట మహేశ్వరి, గ్రేసియా చేతిలో ఓటమిపాలైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Xue Yao  Saina Nehwal  Malaysia Open Super Series Premier  Malaysia Open  

Other Articles