gutta jwala badminton player slams sports ministry

Gutta jwala badminton player slams sports ministry on tops snub

gutta jwala news, gutta jwala updates, gutta jwala hot photos, gutta jwala controversy, gutta jwala marriage, gutta jwala career, badminton player, ashwini ponnappa, gutta jwala ashwini ponnappa

gutta jwala badminton player slams sports ministry on TOPS snub : Indian famous badminton player gutta jwala slams sports ministry for not putting their names in TOPS snub

కేంద్రం తీరుపై జ్వాలలా ఎగిసిపడిన గుత్తా

Posted: 04/02/2015 09:06 PM IST
Gutta jwala badminton player slams sports ministry on tops snub

గుత్తా జ్వాల.. భారత బ్యాడ్మింటన్ స్టార్. క్రీడారంగంలో ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే తన సత్తా చాటుకుని అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దేశవాలీగా జరిగిన ఎన్నో పోటీల్లో పతకాలు సాధించింది. అంతేకాదు.. అంతర్జాతీయ పోరులోనే ఈమె తన ప్రతిభ కనబరిచి పతకాలు సొంతం చేసుకుంది. ఇంతటి అద్భుతమైన క్రీడాకారిణి అయిన ఈమె అందరితోనూ ఎంతో సఖ్యతగా వుంటుంది. కానీ.. ఇంతలోనే ఏమయ్యిందో ఏమోగానీ.. ఒక్కసారిగా కేంద్రంపై జ్వాలలా ఎగిసిపడింది.

అసలు విషయం ఏమిటంటే.. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం విషయంలో గుత్తా, అశ్విని పేర్లు క్రీడామంత్రిత్వశాఖ పొందుపరచలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆమె..  శాఖ తీరుపై మండిపడింది. తనను పట్టించుకోకపోవడంతో ఆమె తీవ్రంగా పరిగణించింది. ఇంతకాలం దేశానికి సేవ చేసినప్పటికీ ప్రభుత్వం తనను చివరికీ ఈ విధంగా అవమానించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. టాప్ పథకం విషయంలో తన పేరు గానీ, అశ్వని పేరు గానీ లేవన్న విషయం తనకు ఇప్పుడే తెలిసిందని జ్వాల చెప్పింది.

ఈ నేపథ్యంలోనే జ్వాల మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ తమకు కేంద్రప్రభుత్వం నుంచి మద్దతు ఉందనుకున్నామని.. కానీ ప్రస్తుత పరిణామం చూస్తే ప్రభుత్వం తమను మోసం చేస్తూ వచ్చిందని ఆమె తెలిపింది. ఇప్పటికే కార్పొరేట్ వర్గాల నుంచి కావల్సినంత సపోర్ట్ ఉన్న క్రీడాకారుల పేర్లే అందులో ఉన్నాయే తప్ప, తనను.. అశ్వనిని పట్టించుకోలేదని వాపోయింది. డబుల్స్ గేమ్లో ఆడేందుకు తాము చాలా కష్టపడ్డామని, కానీ ఇంతలోనే వాళ్లు ఇలా చేస్తారని మాత్రం ఎప్పుడూ ఊహించలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gutta jwala  ashwini ponnappa  sports ministry  tops snub  

Other Articles