Harvard | University | Mumbai

Harvard university international office soon in mumbai

harvard, mumbai, america, capetown, southafrica, bejing, china, students

Harvard is awaiting approval from the Indian government for its School of Public Health to open an office in Mumbai, a report in the college newspaper The Harvard Crimson said.

విద్యార్థుల వద్దకే విద్య.. హార్వర్డ్ యూనివర్సిటి @ ముంబై

Posted: 04/02/2015 10:44 AM IST
Harvard university international office soon in mumbai

ప్రజల వద్దకే పాలన అని తెలుగు ప్రజలకు తెలిసిన ఓ నానుడి. చంద్రబాబు హయాంలో జరిగిన పాలన వ్యవస్థ మార్పుల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. అలాగే విద్యార్థుల వద్దకే విద్య అని కూడా మన తెలుగు రాష్ట్రమే ప్రచారం చేసింది. అయితే దీన్ని దూరాన ఉన్న దేశాలు కూడా విన్నాయో ఏంటో.. విద్యార్థుల వద్దకే తమ యూనివర్సిటిని తీసుకువెళ్లాలని నిర్ణయించింది. అది కూడా ఆషా మాషీ యూనివర్సిటి కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలను కలిగిన యూనివర్సిటి హార్వర్డ్ యూనివర్సిటి. అలాంటి యూనివర్సిటి ఇప్పుడు భారతీయ విద్యార్తుల కోసం ఏకంగా భారత్ కు విచ్చేస్తోంది. అయితే భారత్ తో పాటు మరి కొన్ని దేశాల్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటి తన కార్యక్రమాలను ప్రారంభించనుంది.

హార్వర్డ్ యూనివర్సిటి ప్రెసిడెంట్ డ్రివ్ ఫ్యాస్ట్ ఎప్పటి నుండో తమ యూనివర్సిటీని విస్తరించాలని ఆలోచనలు చేస్తున్నారు. అయితే 2012లో భారత్ సందర్శించిన తరువాత భారత్ లో తమ యూనివర్సిటి కార్యక్రమాలను విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నారు.  భారత్ లోని ముంబై, చైనాలోని బీజింగ్, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లలో హార్వర్డ్ యూనివర్సిటి అంతర్జాతీయ కార్యాలయాలను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు హార్వర్డ్ వర్సీటీకి చెందిన పత్రికలో పేర్కొంటూ వ్యాసాన్ని ప్రచురించింది. ఈ మూడు దేశాల్లోని కార్యాలయాలను తన పరిశోధనకు, అకడమిక్కు అవసరాలకు వినియోగించుకోనుంది.

ఇప్పటికే భారత్తో ఈ విషయంలో చర్చలు జరుపుతున్నామని ఈ ఎండాకలంలోనే అనుమతి వచ్చేఅవకాశం ఉందని హార్వర్డ్ వర్సిటీ ప్రకటించింది. 2015 చివరిలోగా కేప్ టౌన్ నుంచి అనుమతి లభించే అవకాశం ఉందని, 2016 తొలి రోజుల్లో బీజింగ్లో అంతర్జాతీయ కార్యలయాలను ఏర్పాటుచేస్తామని ప్రకటించింది.  వీటి ఏర్పాటు పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కార్యాలయాల సంఖ్య 16 కు చేరుకుంటుంది. మొత్తానికి భారత్ లాంటి దేశాల నుండి అమెరికా వెళ్లి అక్కడ ఎంతో ఖర్చుతో చదువుకునే వారికి కొంత మేలు కలుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో స్థానికంగానే హార్వర్డ్ యూనివర్సిటి ఆఫీసులు అందుబాటులోకి వస్తే, విద్యార్థులకు కాస్త అవగాహన పెరుగుతుంది. ఒకవేళ అవకాశం ఉంటే అక్కడే తమ పరిశోధనను కూడా పూర్తి చెయ్యవచ్చు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harvard  mumbai  america  capetown  southafrica  bejing  china  students  

Other Articles