Sikh Man Brutally Beaten in Birmingham, UK video goes viral

Sikh man brutally beaten in birmingham uk video goes viral

Sikh Man Brutally Beaten in Birmingham, Sikh Man Brutally Beaten in london, Sikh Man Brutally Beaten in united kingdom, crowd watches the assault in UK, sikh man beaten brutally video goes viral,

A Sikh man has been filmed being attacked in Birmingham by another man, while a crowd watches the assault, but does not help, according to local reports.Sikh Man Brutally Beaten in Birmingham UK

ITEMVIDEOS: భారతీయ వ్యక్తిపై లండన్ లో ముష్కరుల దాడి

Posted: 04/01/2015 04:53 PM IST
Sikh man brutally beaten in birmingham uk video goes viral

యూనెటెడ్ కింగ్ డమ్ లండన్ లో భారతీయ వ్యక్తిపై ముష్కరులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. సిక్కు వ్యక్తిని చిదకబాదిన ముష్కరుల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో నిదానంగా నిద్రలేచిన లండన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బర్మింగ్‌హామ్‌లో వీధుల్లో ఓ సిక్కు వ్యక్తిపై అనేక మంది దాడికి పాల్పడ్డారు. అయితే ఎందుకు దాడి చేశారో, దాడి చేయాల్సిన అవసరం ఏమోచ్చిందన్నది మాత్రం తెలియరాలేదు. సిక్కు వ్యక్తి పైన దాడి చేసిన వారు ఎవరో స్వచ్చంధంగా లొంగిపోవాలని పోలీసులు చెప్పారు

డెయిలీ సిక్ అప్‌డేట్ ఫేస్‌బుక్ పేజీలో ఈ దాడి ఫుటేజీ ఇంటర్నెట్లో పెట్టారు. ఆ ఫుటేజీలో ఓ వ్యక్తి తనను కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా సిక్కు వ్యక్తి తన ముఖానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు. ఈ ఘటన సమయంలో చుట్టుపక్కల చాలామంది గుమికూడారు. కానీ అతనిని రక్షించేందుకు ఎవరు కూడా ముందుకురాలేదు. చివరకు ఓ వ్యక్తి దానిని ఆపే ప్రయత్నం చేశాడు. ఇది ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

ఈ ఘటనపై స్పందించిన మిడ్ ల్యాండ్స్ పోలీసు అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ఓ వ్యక్తిని కొడుతున్న వీడియోను చూశామని, ఈ సంఘటన మార్చి 29వ తేదీన బర్మింగ్ హామ్ వీధుల్లో జరిగిందని చెప్పారు. ఈ సంఘటన మతపరంగా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు చెప్పారు. దీనిని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని, దీనిపై పూర్తి విచారణ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తాము ఏం జరిగిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సంఘటన ప్రాంతానికి వెళ్లి అడిగితే, ఎవరు కూడా తాము ఈ దాడికి పాల్పడ్డట్లు చెప్పలేదన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sikh Man  Brutally Beaten  Birmingham  London  UK  

Other Articles