Telangana | Transport | Entry | Tax

Telangana treasury got 50lakhs in over night

tax, entrytax, telangana, andhrapradesh, road, transport, private tarvels, nagarjunasagar, cabinet, court

telangana trasury got 50lakhs in over night. Commuting by road from various places in Andhra Pradesh to Hyderabad and elsewhere in Telangana came to a halt on Tuesday evening with AP private transport operators suspending their services in protest against the TRS government's decision to impose entry tax.

తెల్లారేసరికి తెలంగాణకు 50లక్షల ఆదాయం

Posted: 04/01/2015 09:16 AM IST
Telangana treasury got 50lakhs in over night

తెలంగాణ లోకి ప్రవేశించే ఏపి వాహనాలను ఇతర రాష్ట్రాల వాహనాల కింద పరిగణిస్తామని, ఎంట్రీ ట్యాక్స్ వసూలుకు ప్రభుత్వం జిఓ విడుదల చేసింది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నా, తెలంగాణ ఖజానాకు మాత్రం మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాణిజ్య వాహనాల నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచి  తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయడం మొదలు పెట్టింది. కోదాడ, వాడపల్లి, నాగార్జున సాగర్ చెక్పోస్టులలో ఏపీ నుంచి వచ్చే వాహనాల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు 150 వాహనాల నుంచి 50 లక్షల రూపాయల పన్ను వసూలు చేశారు. అర్ధరాత్రి పన్నులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు మాత్రం సరికావని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. నిబంధనలు అమలు చేస్తున్నామే కానీ ఎలాంటి కక్షసాధింపు చర్యలు లేవని అంటున్నారు.

అయితే తాత్కాలికంగా ఆంధ్రప్రదేశ్ వాహనాలకు కాస్త వెసలుబాటును కలిగించింది. మూడు నెలల ఎంట్రీ ట్యాక్స్ చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు బస్సుల్ని అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని 13 జిల్లాల్లో సుమారు 32 లక్షల లారీలు, 800కిపైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. వీటిలో చాలావరకూ నిత్యం తెలంగాణ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి రోజుకు 300 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కు వస్తున్నాయి.  ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రతి లారీ తాత్కాలిక పర్మిట్ కింద నెలకు సుమారు 6 వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మరి ప్రైవేట్ ట్రావెల్స్, సరుకు రవాణా సాగించే వాహనాలకు తీవ్రంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై పునరాలోచించుకోవాలని ఏపి ప్రభుత్వం పలు రకాలుగా వినతులు చేస్తోంది. ఉమ్మడి రవాణాను కొనసాగించాలని ఏపి మంత్రులు మంతనాలు చేస్తున్నా తెలంగాణ సర్కార్ మాత్రం కొండదిగిరావడం లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏపి వినతిని అంగీకరిస్తుందా లేదా ఖజానా నింపుకోవడానికి ప్రధాన్యత ఇస్తుందా అని చూడాలి. అయితే ఏపి ప్రభుత్వం తెలంగాణ జీవో కు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి కూడా సిద్దమవుతోంది. ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో ఏపి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందని అందరు చర్చించుకుంటున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tax  entrytax  telangana  andhrapradesh  road  transport  private tarvels  nagarjunasagar  cabinet  court  

Other Articles