telangana government increased travel taxes | ap private bus agencies

Andhra pradesh bus serivices stopped to telangana

ap bus services, telangana government, ap private bus services, telangana tax news, bus tax news, telangana increase travel tax, ys jagan mohan reddy news, andhra pradesh government

andhra pradesh bus serivices stopped to telangana : As telangana government has take decision to put tax on travel services.. Ap private buses has decided to stop their travels from this night to telangana state.

తెలంగాణాకు ఆంధ్రా ప్రైవేట్ బస్సుల సౌకర్యం బంద్

Posted: 03/31/2015 06:26 PM IST
Andhra pradesh bus serivices stopped to telangana

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అన్నిరకాల వాణిజ్యవాహనాల నుంచి ప్రవేశపన్ను (ఎంట్రీ ట్యాక్స్) వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే!  ఏ రాష్ట్రంలో త్రైమాసిక పన్ను చెల్లించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో తిరిగేందుకు ఉన్న వెసులుబాటు మార్చి 31తో ముగుస్తుంది. దీంతో ఏపీలో వుండే ప్రైవేట్ బస్సుల యజమానులు సమావేశమై... మంగళవారం అర్థరాత్రి నుంచి తమ సర్వీసులను ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే.. ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే ప్రైవేట్ బస్సులు భారీ సంఖ్యలో నిలిచిపోనున్నాయి. ఈ రోజు అర్థరాత్రి నుంచి దాదాపు 80 శాతం బస్సులు నిలిపివేయనున్నారు.

అయితే.. ఈ పన్ను విధానాన్ని నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీ సర్కార్ ని కోరింది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ప్రస్తుత విధానాన్ని కనీసం మరో ఐదేళ్లైనా కొనసాగించాలని, ఏపీ నుంచి వచ్చే రవాణ వాహనాలపై పన్ను విధించే ఆలోచన విరమించుకోవాలని రోడ్లు, భవనాలు, రవాణ  శాఖమంత్రి శిద్దా రాఘవరావు తెలంగాణ సర్కారుని కోరారు.  10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అటు ఆంధ్రా ప్రాంతానికి కూడా వ్యాపారం, పుణ్య క్షేత్రాల సందర్శరార్థం  పెద్ద ఎత్తున తెలంగాణ వాహనాలు వస్తాయన్నారు. రవాణా పన్ను విషయంలో ఇరు రాష్ట్రాలు కలిస్తే ఎవరిపైనా ఆర్ధిక భారం లేకుండా ఉంటుందని మంత్రి తెలిపారు.

అలాగే.. ఇదే విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ వాహనాలపై పన్ను విధించవద్దని కోరారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడిన ఆయన.. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య పన్నుపై పునరాలోచన చేయాలని కేసీఆర్ తో కోరుతున్నట్లు తెలిపారు. ''రాష్ట్రాలు విడిపోయినా మనది ఒకే భాష. మనం అందరం కలిసే ఉంటాం. రెండు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదు'' అని  వైఎస్ జగన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles