తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు రోజుకొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఉమ్మడి రవాణాకు తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని వాహనాల పర్మిట్లు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ పరిధిలోనే ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ వాహనాల్ని ఇతర రాష్ట్రాల వాహనాలుగానే పరిగణిస్తామని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకోనుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున అప్పటి వరకు ఉమ్మడి రవాణాను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి ఈనెల 31 తో ముగుస్తుంది. దీనిపై న్యాయస్థానం కూడా ఇరు ప్రభుత్వాలు చర్చించుకొని, నిర్ణయాన్ని ప్రజలకు తెలపాలని చెప్పింది. తాజాగా ఉమ్మడి రవాణా గడువు ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పది జిల్లాల్లోని అన్ని రకాల వాహనాల పర్మిట్లు ఇక్కడికే పరిమితమౌతాయని ఉత్తర్వుల్లో స్పష్టం
చేసింది.
అయితే రెండు రాష్ట్రాల ఉమ్మడి రవాణాకు సంబందించి చర్చించి ఓ నిర్ణయం వెలువడుతుందని అప్పట్లో అనుకున్నా. అవి ఏవీ కార్యరూపం దాల్చలేదు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు స్వయంగా తెలంగాణ రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డిని కలిసి ఉమ్మడి రవాణాపై చర్చిద్దామని ప్రతిపాదించారు. అధికారులతో మాట్లాడి మరుసటి రోజు చర్చిద్దామని మహేందర్‌రెడ్డి చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిశాక మాట్లాడుకుందామన్నారు. ఇప్పుడు అవేవీ లేకుండా ఉమ్మడి రవాణాకు స్వస్తి పలుకుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రవాణా ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఖజానాకు కలుగుతున్న నష్టాన్నిగుర్తించింది. తెలంగాణ కు నష్టం కలుగుతుండటంతో పాటు కేవలం ఏపికి మాత్రమే లాభం కలుగుతోంది. అందుకే తెలంగాణ సర్కార్ ఉమ్మడి రవాణాను నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విభజన సమయంలో అనుకున్నట్లు హైదరాబాద్ ను పది సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి రవాణా కు అవకాశం కల్పించారు. అయితే ఉమ్మడి రవాణా తమకు ఎంతో నష్టం కలిగిస్తోందని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది. అందుకే ఏపి వాహనాలను ఇతర రాష్ట్రాల వాహనాల కింద లెక్కేసి, పర్మిట్ లకు తెర తీసింది. మరి ఏపి సర్కార్ దీనిపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more