Spiritual leader Sri Sri Ravi Shankar gets death threats from ISIS

Spiritual leader sri sri ravi shankar gets death threats in malaysia from isis

ISIS threat to Sri Sri Ravi Shankar, ISIS threat letter received in Malaysia, Art of Living Ravi Shankar gets death threats, art of living, threatening letter, ravishankar, ISIS, Sri Sri Ravi Shankar, Malaysia, Ravi Shankar gets death threats from ISIS, Ravi Shankar gets death threats in Malaysia,

A close aide of Sri Sri RaviShankar today claimed that the founder of the 'Art of Living' has received death threats in Malaysia from the Islamic State (ISIS) terror group.

పండిత్ రవిశంకర్ కు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల హెచ్చరికలు

Posted: 03/28/2015 08:47 PM IST
Spiritual leader sri sri ravi shankar gets death threats in malaysia from isis

పైశాచిక చర్యలతో ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దృష్టి ఇప్పుడు ధ్యాన కేంద్రాలపై పడింది. ప్రముఖ గురువు పండిట్ రవిశంకర్ సారధ్యంలోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థ మలేషియా చాప్టర్కు ఐఎస్ ఉగ్రవాదులు శనివారం బెదిరింపు లేఖలు రాశారు. కార్యకలాపాలు నిలిపివేయని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరింస్తూ మూడు లేఖలు రాశారు. దీంతో రవిశంకర్ శిష్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఉగ్రవాదులు బెదిరింపు లేఖలు పంపిన మలేషియా శాఖలో ప్రతిరోజు ఉదయం 10 వేల మందికి పైగా యోగా తరగతులకు హాజరవుతారు. త్వరలోనే సుమారు 70 వేల మంది ప్రజలు పాల్గొనే సభలో పండిట్ రవిశంకర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ భద్రత తమకు ప్రధానాంశమని, లేఖలు ఎవరు పంపారు, ఎలా పంపారనే విషయాల్ని త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. భారత్తోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో వందలకొద్దీ శాఖలున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ.. శాంతియుత జీవన సాధనా ప్రక్రియతోపాటు యోగాలోనూ శిక్షణనిస్తోంది. సంస్థ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్.. రెండు రోజుల కిందటే కాంబోడియాలో మరో శాఖను ప్రారంభించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : art of living  threatening letter  ravishankar  ISIS  Sri Sri Ravi Shankar  Malaysia  

Other Articles