Yogendra Yadav | Prashant Bhushan | AAP

Yogendra yadav prashant bhushan out from aap

Yogendra Yadav, Prashant Bhushan, AAP, panel, Aam Aadmi Party, rebels, kehriwal

Yogendra Yadav, Prashant Bhushan Out from AAP: Aam Aadmi Party rebels Yogendra Yadav and Prashant Bhushan today declared war after being voted out of a key party panel in a process they said was a farce.

ఆప్ వారిని 'తన్ని' తరిమేసిందా.. రెబల్స్ గెట్ ఔటే..!

Posted: 03/28/2015 03:54 PM IST
Yogendra yadav prashant bhushan out from aap

ఆమ్‌ ఆద్మీ పార్టీలో  విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఏకంగా ఆప్ రెబల్స్ పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఆప్ కార్యకర్తలు మాత్రం ఎలాంటి దాడి జరగలేదని అంటున్నారు. ప్రశాంత్ భూషణ్,యోగేంద్ర యాదవ్ లను పార్టీ నుండి బహిష్కరిస్తు పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ తీర్పునిచ్చింది. అయితే ోటింగ్ కు ముందే ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు అక్కడి నుండి వెల్లిపోయారు. వీరితో పాటు ఆజీత్ ఝా, శాంతి భూషణ్లను ఆప్ బహిష్కరించింది. శనివారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లకు అనుకూలంగా కేవలం 8 ఓట్లురాగా, వ్యతిరేకంగా 247 లకు పైగా ఓట్లు వచ్చాయి.

కొంత మంది ఎమ్మెల్యేలు గుండాగిరి చేశారని ఆరోపించారు. వాళ్లంతా కలిసి తమపై భౌతిక దాడులకు యత్నించారని, తమ మద్దతుదారులను గెంటేశారని ప్రశాంత్ భూషణ్,యోగేంద్ర యాదవ్ లు మండిపడ్డారు. పార్టీలో ప్రజాస్వామ్యం నశించిందని, తీవ్ర గందరగోళం మధ్యే తమను పార్టీ నుంచి బహిష్కరించారని వారు ఆరోపించారు. ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆ పార్టీ సహవ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. పార్టీలో ముందు నుంచి వ్యూహం ప్రకారమే గందరగోళం సృష్టించారని శనివారం ఆయన అన్నారు. ఆప్ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత్ భూషణ్, మోగేంద్ర యాదవ్ లను ఆ పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించింది.

ఇదిలాఉండగా, స్టింగ్‌ ఆపరేషన్‌లు ఆమ్‌ ఆద్మీ పార్టీలో తీరని వివాదాలు సృష్టించాయి. తాజాగా జాతీయ కౌన్సిల్‌ సమావేశాలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడినట్లు భావిస్తున్న ఆడియో టేప్‌ భయటపడింది. ఆ టేప్‌లో కేజ్రీవాల్‌ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆప్‌ తిరుగుబాటు నేతలు యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లను పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ తీవ్ర పదజాలంతో దూషించారు. మరే ఇతర పార్టీలోనైనా ఈ పాటికి వారిద్దరిపైనా ఉద్వాసన వేటు వేసి ఉండేవారని మండిపడ్డారు. ఢిల్లీలో గెలిచిన 66 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ నుంచి వైదొలుగుతానని కేజ్రీవాల్‌ బెదిరించారు. ఈ ఆడియో క్లిప్‌ పార్టీలో పెను దుమారం సృష్టించింది. పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలకు ముందు ఇద్దరు నేతలపై కేజ్రీవాల్‌ వైఖరి ఏంటో ఈ స్టింగ్‌ చెప్పకనే చెప్పింది. మొత్తానికి గత కొంత కాలంగా నలుగుతున్న ఆప్ వ్యవహారం ఇప్పుడు ఏకంగా కుమ్ములాటల వరకు వచ్చింది. మరి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లు తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogendra Yadav  Prashant Bhushan  AAP  panel  Aam Aadmi Party  rebels  kehriwal  

Other Articles