Students | Sex | Fees

One in 20 students turning to sex industry to pay fees

fee, sex, UK, university, students, financial

Roughly one in 20 UK students has worked in the sex industry to earn money while at university, a new study has found. Many students are motivated by financial reasons, while others are driven by curiosity.

చదువుకు డబ్బుల్లేక సెక్స్ వర్కర్లుగా విద్యార్థులు

Posted: 03/28/2015 11:45 AM IST
One in 20 students turning to sex industry to pay fees

కొందరు విద్యార్థులకు చదువంటే ప్రాణం. చదువుకోవడం కోసం వారు ఎంతైనా కష్టపడతారు. అయితే తాజాగా యుకె లో విద్యార్థులపై చేసిన ఓ పరిశోధన అవాకయ్యే వాస్తవాలను వెల్లడించింది. కేవలం చదువు కోవడానికి డబ్బుల్లేక సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని అధ్యయనంలో తేలింది. అదీ కొంత మంది కాదు ప్రతి 20 మంది విద్యార్థుల్లో ఒకరు ఇలా సెక్స్ చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తు, తమ చదువును కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థుల్లో సగం మంది ఇలా డబ్బుల కోసం సెక్స్ చేస్తుంటే, కొంత మంది మాత్రం రాయల్ లైఫ్ కోసం సెక్స్ లోకి దిగుతున్నారు. అయితే ఏ వెనుక బడిన దేశంలోనో ఇలాంటి సీన్ అనుకుంటే తప్పే.. ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో ఒకటైన యుకె లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

యుకెలో చదువు కోసం ప్రతి 20 మందిలో ఒకరు సెక్స్ వర్కర్ గా మారుతున్నారు. కాగా యుకెలో ట్యూషన్ ఫీజులే 9 వేల పౌండ్లు వసూల్ చేస్తున్నాయి అక్కడి విద్యాసంస్థలు. యుకె లో సగటు విద్యార్థి డిగ్రీ పూర్తి చెయ్యడానికి 50వేల పౌండ్లు కావాలట. మరి అంత ఆర్థిక స్థోమత లేని అక్కడి విద్యార్థులు ఇలా సెక్స్ లో పాల్గొంటు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా ఒళ్లు అమ్ముకోవడం ద్వారా వచ్చిన డబ్బులతో యూనివర్సిటి ఫీజులు కడుతున్నారు. కొంత మంది తమ అప్పులు కట్టడానికి ఇలా వ్యభిచారానికి దిగుతున్నారు.అయితే  విద్యార్థుల్లో చాలా మంది తాము చేస్తున్న పనిని తమ ఇంట్లో, ఫ్రెండ్స్ కు కూడా తెలియకుండా దొంగచాటుగా చేస్తున్నారు. స్టూడెంట్స్ సెక్స్ వర్క్ ప్రాజెక్ట్ కింద దాదాపు 6,750 మందిపై పరిశోధన చేయగా ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.  అయితే విద్యార్థుల్లో కొందరు డైరెక్ట్ గా సెక్స్ లో పాల్గొంటే కొందరు మాత్రం డ్యాన్సింగ్, పోర్న్ సినిమాల్లో నటిస్తూ, ఆన్ లైన్ లో సెక్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని తేలింది. మొత్తానికి అక్కడ ఫీజులు కట్టడానికి స్థోమత లేని విద్యార్థులు ఇలా సెక్స్ వర్క్ కు దిగుతున్నారు. పాపం విద్యార్థులు ఇలా చదువు కోసం సెక్స్ చెయ్యడం నిజంగా సిగ్గు చేటు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : fee  sex  UK  university  students  financial  

Other Articles