Naxals | Police | Nizamabad

Naxals arrested by the police in telangana

naxals, police, janashakthi, telangana, nizamabad

naxals arrested by the police in telangana. in the nizamabad dist of telangana state police arrested five naxals. they are belongs to janashakti group police told that.

తెలంగాణ లో నక్సల్స్ అరెస్ట్.. అన్నల అలజడి మొదలైందా..?

Posted: 03/27/2015 01:20 PM IST
Naxals arrested by the police in telangana

తెలంగాణ లో మరోసారి అన్నల ప్రాభల్యం మళ్లీ మొదటికి చేరుతుందా అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ నక్సల్స్ ప్రభావం ఉందని కేంద్రం అప్పట్లో హెచ్చరించింది. ఛత్తీస్ ఘడ్ లాంటి రాష్ట్రాల్లో మాదిరిగా నక్సల్స్ తెలంగాణ లో పాతుకుపోయే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా తెలంగాణ అంశం రాజకీయం కనుక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చెయ్యక తప్పలేదు. అయితే తాజాగా కొన్ని తెలంగాణ జిల్లాల్లో నక్సల్స్ కదలికలు మొదలయ్యాయని నివేదికల్లో తేలింది. దాంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిఘా ను పెంచారు. మరోసారి తెలంగాణలో అన్నల ప్రభావాన్ని ఏ మాత్రం పెరగకుండా కట్టడిచెయ్యడానికి నడుం బిగించారు.

తాజాగా నిజామాబాద్ జిల్లా పోలీసులు  జనశక్తి గ్రూప్ నక్సల్స్‌ను ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తపంచాలు, ఒక రివాల్వర్, కొన్ని డిటొనేటర్లు, బుల్లెట్లు, విప్లవసాహిత్యం, బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో వేంపటి కుమార్ అలియాస్ గంగన్న అలియాస్ జీవన్, ఏదులకంటి లింగారెడ్డి అలియాస్ శ్యాం, జంగలం శంకర్, చండ్రుపట్ల సురేష్, అక్కల రాజు ఉన్నారు. అలాగే, వీరికి ఆశ్రయం కల్పించిన నేరంపై మరో ఐదుగురిని బైండోవర్ చేశారు. అంతేకాకుండా జనశక్తి గ్రూపుకు చెందిన కూర రాజన్న, దేవేందర్, విమలక్క తదితర నేతలపై కుట్ర కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో గత కొంత కాలంగా అన్నల కదలికలపై పోలీసులు నిఘాను ఏర్పాటు చేశారు. అయితే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపిలలో మరో సారి నక్సలైట్లు పూర్వ వైభవాన్ని పొందుతారా.. అన్నది ప్రస్తుతానికి తేలని ప్రశ్న.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naxals  police  janashakthi  telangana  nizamabad  

Other Articles