MAA Elections becoming political - Rajendra PRasad vs Jayasudha

Maa elections rajendra prasad vs jayasudha political interference

MAA, Jayasudha, Rajendra Prasad, Murali Mohan, MAA Elections

MAA ex president Murali Mohan makes JayaSudha to contest against Rajendra Prasad.

గుర్తు రాని స్త్రీల ప్రాధాన్యత!! జయసుధ ను గెలిపించాలి- మురళీమోహన్

Posted: 03/25/2015 12:16 AM IST
Maa elections rajendra prasad vs jayasudha political interference

ప్రముఖ నటి జయసుధ తను అద్యక్షురాలిగా ఉండాలని కోరుకున్నారని, మహిళకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అద్యక్షపదవి ఇవ్వాలని అబిప్రాయపడ్డారని ప్రముఖ నటుడు,రాజమండ్రి ఎమ్.పి మురళీమోహన్ అన్నారు. తనకన్నా, అద్యక్ష పదవికి పోటీచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ కన్నా సీనియర్ నటి జయసుధ అని ఆయన చెప్పారు. 

చిరకాలంగా మా అధ్యక్షుడిగా వుంటూ వస్తున్న మురళీ మోహన్ ఈసారి కూడా పరోక్షంగానైనా మా పై ఆధిపత్యం వదులుకోరాదని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? సీనియర్ నటుడిగా, హీరోగా గతంలో ఓసారి ఓడిపోయిన రాజేంద్ర ప్రసాద్ తాను అధ్యక్షుడిగా వుండాలనుకుంటున్నని బాహాటంగా చెప్పినా కూడా ఎందుకు సమ్మతించలేకపోతున్నారు. అంటే తెలుగు సినిమా కళాకారులంతా ఒకటే అన్నది ఒట్టి మాటేనా? వారిలో వారికే సరిపడదా? వారిలో పార్టీ బేధాలు కూడా వున్నాయా? ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. 

ఆమె ఎంతో సీనియర్ నటి అని... చాలా ఏళ్లుగా ఆమె సినిమాల్లో నటిస్తూ సినీరంగానికి సేవ చేశారని ఆయన గుర్తు చేశారు. తాము ప్రతిపాదిస్తున్న బృందంలో స్ర్తీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగలిగినప్పటికీ అవతలి వ్యక్తులు మాత్రం స్ర్తీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.  జయసుధ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారని అన్నారు. జయసుధ తరపున మురళీమోహన్ ప్రచారం ఆరంబించారనుకోవచ్చు..

రాజేంద్ర ప్రసాద్ ‘ మా’ అధ్యక్షపదవి కి తాను పోటీ చేస్తున్నానని మీడియా సమావేశం పెట్టి వెల్లడించిన తరువాత మురళీ మోహన్ -  ఆయనకు అప్పుడే ఆ స్థాయి (మా అధ్యక్ష పదవి చేపట్టే) వచ్చిందా’ అని మురళీ మోహన్ కొందరితో అన్నట్లు,  అందుకే రాజేంద్ర ప్రసాద్ తరువాత కొందరికి ఇంటర్వూ ఇచ్చినపుడు ఈ స్థాయి..అనే పదాన్ని నొక్కి నొక్క మరీ చెప్పారట. అంతే కాదు ఆఫ్ ది రికార్డుగా మురళీమొహన్ మాటలు కూడా చెప్పి, బాధపడినట్లు తెలుస్తోంది. 

 
హీరోగా మురళీ మోహన్ కన్నారాజేంద్ర ప్రసాద్ ఎక్కవ సినిమాలు చేసారు. ఇప్పటికీ మురళీ మోహన్ కన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ఆయన కూడా సినిమాలు నిర్మించారు. ఎటొచ్చీ రాజకీయాలు చేయకపోవచ్చు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేయకపోవచ్చు.
 
అసలు ఈ సారి కూడా మురళీ మోహన్ పోటీ చేస్తానన్నారట. కానీ కొందరు పెద్దలు వారించారట. అన్ని పదవులు ఒక్కరికేనా అన్న మాట వస్తుంది అని.అందుకే పోటీ చేయకూడదనుకున్న, మురళీ మోహన్ స్ట్రాటజీ మార్చి, తను తెరవెనుక వుండి జయసుధన ను రంగంలోకి దింపారు. నిజానికి రాజేంద్ర ప్రసాద్ సీనియార్టీని గౌరవించి, ఏకగ్రీవంగా వదిలేసి వుండాల్సింది. కానీ మురళీ మోహన్ పంతానికి వెళ్లి, జయసుధను నిల్చోపెట్టడం ఎంతవరకు సబబు అన్న డిస్కషన్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.అసలు రాజేంద్ర ప్రసాద్ కు ఎందుకు మోకాలు అడ్డుతున్నారన్నది మరో పాయింట్. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రాజేంద్ర ప్రసాద్ సినిమా పెద్దలు అని అనుకునేవారిని ఎవరినీ సంప్రదించకుండానే, తనంతట తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించడమే, ఆయన చేసిన తప్పిదమని తెలుస్తోంది.
 
కృష్ణ నగర్ లో మాత్రం అంత ఈవిధంగా అనుకుంటున్నారు:
 
1. మరి గత సంవత్సరాల్లో తమరు మా ప్రెసిడెంట్ గ వున్నప్పుడు ఈ స్త్రీల ప్రాధాన్యత గుర్తు రాలేదా? లేకపోతె ఇంకెవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా మీరే ఎందుకు ప్రెసిడెంట్ గ వున్నారు? 
 
2. జయసుధ కన్నా సీనియర్ ఆక్టర్ లే లేరా? 
 
3. జయసుధ  గారు మరి MLA  గ వుంది ఏమి చేసారు సినిమా ఆర్తిస్తులకి? ఇప్పుడు మల్లి మా పదవికి తయారా!
 
4. రాజేంద్ర ప్రసాద్ లో వున్నా నెగటివ్ లు ఏంటి?
 
5. అయిన మీరు సినిమాల్లో నటిచంటంలేదు, ప్రెసిడెంట్ గ అయిపోయిన తర్వాత ఎందుకీ కుళ్ళు  రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ లొ. 
 
6. ఇలాంటి తుక్కు రాజకీయాలు చేసి ముందుగ తెలంగాణా ప్రజల ఆస్తులు కొట్టేసి తర్వాత రియల్ వెంచర్ లు వేసి .., ఈ నాడు తెలుగు ప్రజలు విదిపోవలసి వచిన్ది.. ఇలాగే MAA ని కూడా ..
 
7. జయసుధ గారు MLA గ వుండి ఎంత నాయకత్వ ప్రతిభ ప్రదర్సించారో, సేవ చేసారో మరిచిపోతే ఎలా మాస్టారు ? ఈ రాజకీయం కన్నా నిజంగా సినీ ఆర్టిస్ట్ బాగోగులని చూస్తె ఎంతో మేలు అనుకుంటున్నారు...
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : MAA  Jayasudha  Rajendra Prasad  

Other Articles