The mysterious death of dk ravi ias officer case to cbi

dk ravi, suiside, banglore, kolhar, cbi, karnataka, siddramappa, dk ravi ias

Bowing to mounting public pressure, Chief Minister Siddaramaiah today decided to hand over to CBI the probe into the mysterious death of an upright IAS officer that had led to national outrage and state-wide protests.

రవి కుమార్ ఐఏఎస్ కేసు సిబిఐకి అప్పగింత

Posted: 03/23/2015 01:05 PM IST
The mysterious death of dk ravi ias officer case to cbi

నిఖార్సైన ఐఏఎస్ అధికారి డికె రవికుమార్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇసుక మాఫియాపై కొరడా జులిపించిన డికె రవి కుమార్ అనుమాస్పదంగా మృతి చెందడంపై మీడియాలో పలు కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ప్రేమ వ్యవహారం కూడా రవి కేసులో ఉందంటూ వచ్చిన నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం కేసు విచారణపై మళ్లగుళ్లాలు పడింది. చివరకు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద్రామయ్య ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. కేసులో తలెత్తిన వివాదాలు, వస్తున్న విమర్శల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

డికె రవి కుమార్ కేసు వివాదంలో రవి మృతిపై వారి కుటుంబ సభ్యుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమయింది. కేసును ఎంతో పారదర్శకంగా దర్యాప్తు చేయించి, తమకు న్యాయం చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే రవి కుటుంబ సభ్యులు, ప్రజల నుండి వస్తున్న వినతుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి సిబిఐ విచారణలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dk ravi  suiside  banglore  kolhar  cbi  karnataka  siddramappa  dk ravi ias  

Other Articles