Ys jaganamohan reddy comence to bus yathra on ap projects

ys jagan, ysr congress, jaganmohanreddy, bus yathra, ysrcp

ys jaganamohan reddy comence to bus yathra on ap projects. ysr congress party main leader ys jagan may ready to do bus yathtra in andhra pradesh.

ఇక బస్సెక్కి తొడకొట్టనున్న జగన్

Posted: 03/23/2015 11:43 AM IST
Ys jaganamohan reddy comence to bus yathra on ap projects

వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వైయస్ జగన్ మరో యాత్రను చెపట్టబోతున్నారట. ఏమాత్రం అవకాశం వచ్చినా వెంటనే యాత్రలను మొదలుపెట్టే జగన్ ఈ సారి ప్రాజెక్టుల పేరుతో యాత్రకు సిద్దమయ్యారు. మామూలుగానే మంది మార్భలంతో రోడ్ల మీద తన సంఖ్యా బలాన్ని ప్రదర్శించే జగన్ ఈ దఫాలో ఎలా రెచ్చిపోతారో చూడాలి. అసెంబ్లీలొ కాస్త గట్టిగానే నిరసన గళాన్ని వినిపించిన జగన్, మరింత రెచ్చిపోయి మాట్లాడటం కాయం అని అప్పుడే కొందరు అనుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 26 నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్లతో పాటు ప్రకారం బ్యారేజీల పరిశీలన, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్తో పాటు రాయలసీమలోని అన్ని ప్రాజెక్ట్లను వైఎస్ జగన్ పర్యటించనున్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ స్థితిగతులపై వచ్చే గురువారం నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర చేయనున్నారు. మరి ఈ సారి యాత్రలో జగన్ భజన పరులు ఎలా రెచ్చిపోతారో, జగన్ మీడియా ఎలా సుత్తి పెడుతుందో చూడాలని అప్పుడే చర్చ కూడా సాగుతోంది. మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే జగన్ యాత్ర ప్రారంభించే వరకు ఆగాలి మరి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  ysr congress  jaganmohanreddy  bus yathra  ysrcp  

Other Articles