Tdp ysrcp partys walking in the same way at assembly sessions

ysrcp, ysr congress, tdp, ttdp, no confidence, motion, assembly, speaker

ttdp leaders commence to no confidence motion on telanagana assembly speaker. in ap state assembly ysrcp leaders also tried to get proposal of no confidendence motion on kodela shivaprasad.

టిడిపి బాటలో వైయస్ఆర్ కాంగ్రెస్

Posted: 03/20/2015 10:46 AM IST
Tdp ysrcp partys walking in the same way at assembly sessions

టిడిపి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఒకదానికొకటి బద్దశత్రువులు. రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోతుందేమో అన్నంతగా ఉన్నాయి వైరాలు. అయితే ఆ పాత గొడవలు అన్నీ మరిచిపోయి టిడిపి చూపిన బాటలో వైయస్ఆర్ కాంగ్రెస్ నడుస్తోంది. అదేంటి వాళ్లకు వీళ్లకు పడదు కదా అనే అనుమానం కలుగుతుందేమో.. కానీ అలాంటివి పక్కన పెట్టండి. పరిస్థితులు రెండు పార్టీలను ఒకే బాటలో నడిపిస్తున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణ స్పీకర్ పై టిటిడిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ కూడా వారి దారిలోనే నడవాలని ఆలోచిస్తోంది. ఏపి అసెంబ్లీలో తమ గొంతు నొక్కుతూ సభ నియమాలను పాటించడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై గుర్రుగా ఉంది. అందుకే వారు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్దమవుతున్నారు. అయితే అవిశ్వాస తీర్మానంపై తమ పార్టీ నేతలకు అవకాశం కల్పిస్తేనే సభలోకి అడుగు పెడతానని జగన్ భీష్మించుకు కూర్చున్నాడు. మరి కాసేపట్లో రెండు అసెంబ్లీ సమావేశాలు కీలక మలుపు తిరుగుతాయో లేదా మామూలుగా సాగుతాయో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  ysr congress  tdp  ttdp  no confidence  motion  assembly  speaker  

Other Articles