Telanagan govt tryibg to release job notifications soon

telanagana, notifications, jobs, osmania university, unemployees, tpsc, kcr, kamalanathan committee

telanagan govt tryibg to release job notifications as soon as possible. the osmania university students commenced to rally for aganist the govt. lot of students are waiting for the job notifications.

ఓయు దెబ్బకు నోటిఫికేషన్ల జారీకి చర్యలు

Posted: 03/20/2015 08:50 AM IST
Telanagan govt tryibg to release job notifications soon

ఉద్యోగాల కోసం వెంటనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చెయ్యాలని ఉస్మానియా విద్యార్థులు చేసిన ధర్నాలతో తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వస్తోంది. లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  ఈ మేరకు ఆయా శాఖల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను తెలపాలంటూ ముఖ్య మంత్రి కార్యాలయం నుంచి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖ అందింది. మరో వైపు డీఎస్‌సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం మరింత ఆలస్య మయ్యే అవకాశం కన్పిస్తోంది. ఉద్యమ కాలంలో ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల కాకపోవ డంతో వయోపరిమితి సమస్య తలెత్తే అవకాశముంది. దీంతో వయో పరిమితి విషయంలో నిరుద్యోగ యువతకు 10 ఏళ్ల సడలింపును ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయ నున్నామని అసెంబ్లిలో ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా ఓయు విద్యార్థుల  నుండి వ్యతిరేకత వస్తుండటంతో చర్యలకు పూనుకుంది తెలంగాణ సర్కార్.

రాష్ట్ర విభజన నేపథ్యంలొ ఉద్యోగుల విభజన కోసం కేంద్రం కమల్‌నాథన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేవలం రాష్ట్రస్థాయి కేడర్‌ పోస్టులనే విభజించనుంది. కమిటీ ఇప్పటికే ఉద్యోగుల సంఖ్యను తేల్చే ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు సమాచారం. నిజానికి ఈ నెలాఖరులోపు ఉద్యోగుల వివరాలను కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.  దీంతో కేంద్రం కమిటీ  కమల్‌నాథన్‌ కమిటీని అక్టోబర్‌ వరకు పొడిగించింది. కమల్‌నాథన్‌ కమిటీ తన పని పూర్తిచేస్తే ఉద్యోగ ఖాళీల వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీల సంఖ్య గణనీయంగా ఉంది. ఖాళీలను భర్తీ చేయ కపోవడంతో ఉన్న ఉద్యోగులతోనే సరిపెట్టుకోవాల్సి న పరిస్థితి నెలకొంది. కనీసం ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్లకు చర్యలు తీసుకోవడం నిరుద్యోగులకు మంచి వార్తే.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  notifications  jobs  osmania university  unemployees  tpsc  kcr  kamalanathan committee  

Other Articles