Dacoits loot finance minister wife in train

Dacoits loot finance minister, Dacoits loot finance minister and his wife, Madhya Pradesh finance minister Jayant Malaiya, Jabalpur-Nizamuddin Express, First Class AC compartment, daciots boarded near Kosi Kalan in Mathura district, Uttar pradesh, dacoits looted the passengers at gun point.,

In a shocking incident that exposed the sorry state of safety in running trains, dacoits looted Madhya Pradesh finance minister Jayant Malaiya and his wife in the Jabalpur-Nizamuddin Express in the wee hours of Thursday.

ఔరా..! బంధిపోట్లకు మంత్రి దంపతుల నిలువు దోపిడి..!

Posted: 03/19/2015 04:47 PM IST
Dacoits loot finance minister wife in train

ఆయన అమాత్యుడు.. అలా అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన తలకే తుపాకి గురిచేసి వుంది. ఆంత ధైర్యం ఎవరికి వుంది..? అనుకుంటున్నారా. ఇదేదో సినిమా కథ మాత్రం కాదండి. నిజంగానే మంత్రి తలకు తుపాకీ గురి పెట్టి ఆయన సహా ఆయన భార్య వద్దనున్న విలువైన బంగారు అభరణాలతో పాటు డబ్బు దస్కం అంతా దోచేసుకున్నారు. నమ్మశక్యంగా లేదా..? మంత్రి గారి వద్దకెళ్లి ఆయన తలపై తుపాకీ గురిపెట్టి ఆయనను దోచుకునే వాళ్లు వున్నారంటే.. నమ్మలేం అనుకోకండి. ఇది నిజమే. అయితే ఇది మన తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఘటన మాత్రం కాదు. అలా అని భారత దేశంలో కూడా జరగని ఘటనగా కోట్టిపారేయకండేం. ఇది జరిగింది నేరాల అధికంగా చోటుచేసుకునే ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర జిల్లాలో.

అవునా..? నిజమేనా..? అనుకోకుండా.. వివరాల్లోకి వెళ్థామా మరి.. ఆయన మధ్యప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి జయంత్ మలయ్య, ఆయన తన సతీమణి తో పాటు మధ్యప్రదేశ్ కు వెళ్తుండగా ఈ చేధు ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ఆయన జబల్పూర్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్టుమెంటులోకి మధుర జిల్లాలోని కోసి కలాన్ వద్ద రైలులోకి చోరబడిన బందిపోట్లు.. ప్రయాణికుల తలపై తుపాకిలు గురిపెట్టి అందరినీ నిలువు దోపిడి చేశారు. బంధిపోట్ల దోపిడికి గురైన వారిలో స్వయంగా అమాత్యులు కూడా వున్నారు. అయితే.. తానెవ్వరు అనేది తెలియకుండానే.. మంత్రిగారిని అయన సతీమణిని నిలువు దోపిడి చేశారు. ఆ తరువాత కూడా అటుగా వెళ్లిన మరో రైలును కూడా బందిఫోట్లు దోచుకున్నారని సమాచారం. ఈ ఘటనతో విస్మయానికి గురైన ఆర్థిక మంత్రి ఈ విషయమై స్వయంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jabalpur-Nizamuddin Express  Dacoits  Madhya Pradesh minister  Jayant Malaiya  

Other Articles