Sadhvi prachi courts another controversy calls mahatma gandhi a british agent

Sadhvi Prachi courts another controversy, Firebrand VHP leader Sadhvi Prachi courts another controversy, Sadhvi Prachi calls Mahatma Gandhi a British agent, father of the nation mahatma gandhi, freedom fighters Bhagat Singh and Veer Savarkar, former cji markandeya katju

Firebrand VHP leader Sadhvi Prachi on Tuesday courted fresh controversy by saying that those who do not chant 'Bharat Mata ki Jai' and 'Vande Mataram' have no right to live in India.

ఖడ్జూ తరువాత మహాత్ముని టార్గెట్ చేసిన సాధ్వీ ప్రాచి

Posted: 03/19/2015 03:15 PM IST
Sadhvi prachi courts another controversy calls mahatma gandhi a british agent

కేంద్రంలో బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందుత్వ శక్తులు జడలు విప్పుతున్నాయి. పదేళ్ల యూపీఏ పాలతో స్థబ్దుగా వున్న హింధుత్వ శక్తులు ఇప్పుడు ఏకంగా మహనీయలను లక్ష్యంగా చేసుకుని వ్యతిరేక వ్యాఖ్యాలు చేస్తున్నారు. కేంద్రంలోని నేరేంద్ర మోడి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తున్నారు. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించిన తరువాత కూడా హిందుత్వ శక్తులు వాటి పరుధులను ధాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాయి.

తాజాగా విశ్వ హిందూ పరిషత్ కు చెందిన నేత సాధ్వి ప్రాచీ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ ఖడ్జూ తరువాత ఆయన సాధ్వీ అవే వివాదాస్పద వ్యాఖ్యలను మళ్లి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ బ్రీటిష్ ఏజెంట్ అని అమె అన్నారు. మహాత్ముడు అహింసా మార్గం అనుసరించడంతోనే లేక తన చరకా తిప్పడం వల్ల భారతావని స్వత్రంత్యం రాలేదని భగత్ సింగ్, వీర్ సావర్కర్ లాంటి సమరయోధుల త్యాగాల వల్ల వచ్చిందని అమె అన్నారు.

అంతటితో అగకుండా భారత్ లో వున్నవాళ్లు భారత్ మాతాకీ జై, వందే మాతరం అని కీర్తించాలన్నారు. అలా అనేందుకు విముఖత చూపే వాళ్లు భారత్ లో వుండేందుకు అనర్హుల అని అమె వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బాహర్యాచ్ జిల్లాలో నిర్వహించిన ఓక కార్యక్రమానికి అతిధిగా హాజరైన అమె.. ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఇదే తరహాలో హిందువులు నలుగురు పిల్లల్ని కంటే చాలని, ఓ వర్గాన్ని  టార్గెట్ చేస్తూ.. వారిలా నలభై మందిని కనాల్సిన అవసరం లేదని కూడా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vhp  controversy  mahatma gandhi  british  bhagat singh  hindu  

Other Articles