Raghuveera reddy takes on tdp government

Raghuveera reddy takes on TDP government, Raghuveera reddy lashes out on ap government, Raghuveera reddy fires on chandrababu, Raghuveera reddy on pollavaram, Raghuveera reddy on pattiseema, N Raghuveera reddy, appcc chief, ap special status, pattiseema, karry sankarayya,

Raghuveera reddy takes on TDP government

ప్రత్యేకహోదాను పక్కనబెట్టి.. ‘పట్టిసీమ’ కట్టి ముంచుతున్నారు

Posted: 03/18/2015 06:03 PM IST
Raghuveera reddy takes on tdp government

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలు, అభివృద్దిని పరిగణలోకి తీసుకున్న తమ ప్రభుత్వం.. పునర్విభజన బిల్లులో పలు అంశాలను జోప్పించిందని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామన్నారు.  అయితే ఆంధ్రప్రదేశ్ రాస్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజక్టుకు కూడా తక్షణం నిధిులు విడుదల చేసి యుద్దప్రాతిపదికన పనులు జరిగేలా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పక్కదారి పట్టించే పనులను చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రజల దృష్టి మరల్చేందుకు  చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. ఎత్తిపోతల పథకంలో రాయలసీమకు ప్రయోజనం శూన్యమన్నారు. ఈ ప్రాజెక్టుతో మళ్లీ రాయలసీమ రాళ్లసీమగా మారే ప్రమాదముందని ఆయన అంధోళన వ్యక్తం చేశారు.

పట్టిసీమ ఖర్చెపెట్టే నిధులను కూడా పోలవరానికి ఖర్చు పెట్టి ప్రాజెక్టును త్వరగా పూర్తైయ్యేట్లు చూడాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని రఘువీరారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంలో బీజేపీ కుంటి సాకులు చెబుతోందని ఆయన విమర్శించారు. పట్టిసీమ పథకంతో భూమి కోల్పోనున్నమన్న బెంగతో మృతి చెందిన రైతు కర్రి శంకరయ్యది ప్రభుత్వ హత్యే అని రఘువీరా ఆరోపించారు. శంకరయ్య కుటుంబాన్ని ఆదుకుని... రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuveera reddy  ap special status  pattiseema  karry sankarayya  

Other Articles