Maoists attacked on a police officer at chattisgarh

chattisgarh, police, maoists, attack, beat,

in chattsigarh state sukma dist. police men travel to goruguda on a bike, maoists stoped them. in two of police one police escaped from there.

చంపలేదు.. చితకబాదారు.. పోలీసుపై మావోలు

Posted: 03/17/2015 10:11 AM IST
Maoists attacked on a police officer at chattisgarh

ఛత్తీస్గఢ్లో పోలీసును మావోయిస్టులు చంపకుండా, చితకబాది వదిలేశారు. అయితే మావోయిస్టుల చేతిలో చావకుండా, తన్నులు మాత్రమే తిన్నడం ఇదే మొదటిసారి అని సమాచారం. సుక్మా జిల్లా పోలంపల్లి స్టేషన్ ఏఎస్ఐ దేవాంగి, మరో కానిస్టేబుల్తో కలిసి  బైక్పై గోరుగూడ వైపు వెళ్తుండగా వారిని మార్గ మధ్యలో మావోయిస్టులు అడ్డగించారు. మావోయిస్టులను చూడగానే వాహనం వెనుక కూర్చున్న కానిస్టేబుల్ పారిపోగా, ఏఎస్ఐ మాత్రం దొరికిపోయాడు. అతణ్ణి మావోయిస్టులు కర్రలతో విపరీతంగా కొట్టారు.  దెబ్బలకు తాళలేక కిందపడిపోయిన దేవాంగిని అక్కడే విడిచిపెట్టి మావోయిస్టులు వెళ్లిపోయారు.
 
పోలీస్ అధికారి గురించి స్థానికులు పోలంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకొని అతన్నిదోర్నపాల్ ఆసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ దేవాంగికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. . ఏఎస్ఐని కొట్టి విడిచిపెట్టడం ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మావోయిస్టులు ఇప్పటి వరకు ఇలా ఏ పోలీస్ అధికారిని వదిలిపెట్టింది లేదు.. దాంతో ఈ ఘటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే మావోల చేతి నుండి తప్పించుకున్న  ఏఎస్ఐ దేవాంగి ఎంతో అదృష్టవంతుడని స్వంత డిపార్ట్ మెంట్ వారే చర్చించుకోవడం విశేషం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chattisgarh  police  maoists  attack  beat  

Other Articles