Telanagana excise minister on liquior owner in t assembly

telangana, assembly, padmarao, sunithareddy, excise, wines

telanagana excise minister on liquior owner in t assembly. in assembly sessions telanagana excise minister padmarao fire on liquior owner.

మద్యం వ్యాపారి లాబీయింగ్.. మంత్రి వార్నింగ్

Posted: 03/17/2015 09:25 AM IST
Telanagana excise minister on liquior owner in t assembly

ఎన్నికల్లో పార్టీకి, రాజకీయ నాయకులకు సహాయం చేస్తు, వారు అధికారంలోకి వస్తే లాభం పొందే వారు ఎంతో మంది ఉంటారు. పార్టీకి ఎంతో పాటుపడ్డాడని అధికార పార్టీ నేతలు కూడా అలా సహాయం చేసిన వారికి కొంత అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి ఘటనే తెలంగాణ అసెంబ్లీలో జరిగింది. ఇటీవల నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట ప్రాంతంలో ఎక్సైజ్‌ అధికారులు వైన్‌ షాపులపై దాడులు నిర్వహించారు. సుంకం చెల్లించని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యుడైన వైన్‌ షాప్‌ యజమానిపై కేసు నమోదు చేశారు. అతని మద్యం దుకాణాన్ని మూసివేయించారు. వైన్‌ షాప్‌ యజమానిని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి  అసెంబ్లీకి తీసుకొచ్చారు.

'ఈయన మా దగ్గరే మద్యం దుకాణం నడుపుతున్నాడు. ఆయనపై కేసు పెట్టి, దుకాణం మూసివేయించారు. కానీ, ఇతను మన పార్టీకి బాగా కావాల్సిన వాడు. ఎన్నికల సమయంలో ఎంతో సాయపడ్డాడు. వెంటనే కేసు ఎత్తివేయించి, షాపు తిరిగి తెరిపించే ఏర్పాటు చేయాలి' అని గొంగడి సునీతారెడ్డి కోరారు. అయితే తెలంగాణ ఎక్పైజ్ మంత్రి పద్మారావ్ ఆ మద్యం వ్యాపారిపై ఘాటుగా స్పందించారు. సుంకం చెల్లించకుండా మద్యం అమ్ముతున్నందుకు నీ పై కేసు పెట్టారు. మరీ ఎక్కువ తక్కువ చేస్తే పీడీ యాక్ట్‌ పెట్టిస్తా అని తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి ఘటనల గురించి మనం తరుచూ వింటూనే ఉంటాం, అయితే మంత్రి గారి స్పందన మాత్రం ఎవరూ ఊహించరు. మొత్తానికి మద్యం వ్యాపారి పప్పులుడకలేదనే చెప్పాలి. అంత లాబీయింగ్ చేసినా ఫలితం లేకుండా పోయింది పాపం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  assembly  padmarao  sunithareddy  excise  wines  

Other Articles