Volvo bus escapes accident rushes into paddy field

volvo bus rushes into paddy field, volvo bus rushes into paddy field in vishakapatnam, volvo bus escapes accident in vishakapatnam, volvo bus escapes accident with tractor, volvo bus driver handles bus, driver injured as volvo bus enters into paddy field, no injuries to passengers as volvo bus goes into paddy field,

volvo bus rushes into paddy field after it escapes a tractor in vishakapatnam

డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం.. పోలాల్లోకి వాల్వో బస్సు

Posted: 03/15/2015 05:43 PM IST
Volvo bus escapes accident rushes into paddy field

రోడ్డుపై నడవాల్సిన బస్సు పోలాల్లోకి దున్నుతున్నట్లు వుంది కదూ.. ఈ చిత్రం. కానీ బస్సు పొలాల్లోకి ఎందుకెళ్లిందనుకుంటున్నారు. రహదారిలో అడ్డువచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయిన వోల్వో బస్సు రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ సంఘటన విశాఖ జిల్లా కాశీంకోట సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు.

బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పోలాల్లోకి పోనివ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సులోని దాదాపు 33 మంది ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో స్వస్థలాలకు పంపారు. గాయపడిన డ్రైవర్ను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : volvo bus  paddy field  vishakapatnam  tractor  

Other Articles