Telanagana govt employess will get revised salaries from april

telanagana, prc, salary, eetela, finance minister, assembly,

telangana finacial minister eetela rajender announce that telanagana govt employess will get revised salaries from april. over three lakh employees will get the benefit.

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త వేతనాలు.. తెలంగాణ సర్కార్ ప్రకటన

Posted: 03/14/2015 08:58 AM IST
Telanagana govt employess will get revised salaries from april

తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులకు ఏప్రిల్‌ 1 నుంచి కొత్త వేతనాలు అందుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. 3 లక్షల మంది ఉద్యోగులకు కొత్త వేతనాలు మార్చి 1 నుంచి అమలవుతాయని చెప్పారు. మూలవేతనంలో 63.34 శాతం కరవు భత్యాన్ని,43 శాతం ఫిట్‌మెంట్‌ను 2014 జూన్‌ 2 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి పెంచిన జీతాల బాండ్స్‌ను ఇవ్వబోతు న్నామని, ఐదేళ్ల తర్వాత వడ్డీతో కలిపి చెల్లిస్తామన్నారు. ఫిట్‌ మెంట్‌ అమలుకు ఎన్నికల సంఘం అనుమతించిందని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఫిట్‌మెంట్‌ 39 శాతం మాత్రమే చెల్లించారని, తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 43 శాతం ఫిట్‌ మెంట్‌ను ప్రకటించి చరిత్ర సృష్టించిం దన్నారు.

వాస్తవంగా 10 వ వేతన సవరణ సంఘం ఇంత మొత్తం సిఫార్సు చేయలేదన్నారు. కొత్త వేతనాలు ఉద్యోగులతో పాటు విశ్వ విద్యాలయాల్లో పని చేసే బోధనేతర సిబ్బంది, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పని చేసే వారికి కూడా వర్తిస్తుందన్నారు. పెరిగిన వేతనాలు వల్ల 6,700 ల కనీసవేతనం తీసుకునే ఉద్యోగి ఇకపై 13 వేలు తీసుకుంటారని,అదే విధంగా గరిష్టంగా 55 వేలు తీసుకునే అధికారి 1,10,850 తీసుకుంటారని ఈటెల వెల్లడించారు. పెన్షనర్లకు 3,350 నుంచి 6,500 పెరుగుతుందని,ఇంక్రిమెంట్‌ను 3 నుంచి 5 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వైద్య అలవెన్స్‌ 200 నుంచి 350కి, బోధనాఫీజు 1000 నుంచి  2,500లకు , టీఏ, డీఏ 63.34 శాతానికి పెరుగుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  prc  salary  eetela  finance minister  assembly  

Other Articles