Avinash surrenered himself to ap police at hyderabad

avinash, dgp, surrender, ap, kakinada, humanrights, police

avinash surrenered himself to ap police at hyderabad. avinash, who cheat several members for jobs was surrender him self at ap state dgp office at hyderabad. yesterday media focus on avinash matter.

పోలీసులకు లొంగిపోయిన అవినాష్

Posted: 03/12/2015 02:06 PM IST
Avinash surrenered himself to ap police at hyderabad

ఏపి హోం మంత్రి చినరాజప్ప బంధువునంటూ పలువురిని మోసం చేసిన అవినాష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హైదరాబాద్లో ఏపీ డీజీపీ కార్యాలయానికి వచ్చిన అవినాష్ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయాడు. ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునంటూ పలువురికి టోకరా వేయడమే కాకుండా, అతనిని నిలదీసిన బాధితులపై దాడికి పాల్పడి, చిత్రహింసలకు గురి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్రపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మంగళవారం  కేసు నమోదు చేశారు. అందులోభాగంగా అవినాష్ను పట్టుకునేందుకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం అవినాష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అలాగే అవినాష్ వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. అవినాష్ దురాగతాలపై ఏప్రిల్ 6 నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కొంత మంది వ్యక్తుల దగ్గరి నుండి డబ్బులు వసూలు చెయ్యడం, కొన్ని విద్యాసంస్థలను బెదిరించి మామూళ్లను వసూలు చేసిన కేసులో అవినాష్ నిందితుడు. కాగా తమ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన వారిని దారుణంగా చితకబాదిన అవినాష్ విషయం మీడియా ద్వారా బయటికి పొక్కింది. దాంతో అతని చేతుల్లో మోసపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి ముందుకు వచ్చారు. దాంతో అవినాష్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : avinash  dgp  surrender  ap  kakinada  humanrights  police  

Other Articles