Former nurse turns into fake lady doctor

former nurse turns into fake lady doctor, Kanchanbagh police, fake lady doctor in Kanchanbagh, fake lady doctor in Hyderabad, fake lady doctor in Marutinagar, fake lady doctor vara lakshmi arrested in hyderabad, fake lady doctor Varalalkshmi arrested in Kanchanbagh, localites complained against fake lady doctor

former nurse turns into fake lady doctor, arrested in hyderabad

పాత నర్సు.. ‘డాక్టర్’ బాగోతం భట్టబయలు..

Posted: 03/12/2015 12:50 PM IST
Former nurse turns into fake lady doctor

కొత్త వైద్యుడి కన్నా.. పాత రోగికే మందుకు గురించి, రోగుల గురించి పరిజ్ఞానం అధికంగా వుంటుందని చిత్రసీమకు చెందిన పలువురు దర్శకులు చమత్కరిస్తూ.. చిత్రీకరించిన ప్రభావమో.. ఏమో తెలియదు కానీ.. అచ్చం అలానే చేసి.. అడ్డంగా చిక్కింది ఓ డాక్టరమ్మ. రోగుల కన్నా తనకే ఇంకా బాగా రోగులకిచ్చే చికిత్స గురించి బాగా తెలుసుకున్న ఓ పాత నర్సు డాక్టరు బాగోతం భట్టబయలైంది. వైద్యురాలి అవతారం ఎత్తి కటకటాల పాలైంది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ మారుతీ నగర్ పరిధిలోని కంచన్బాగ్ ఏరియాలో నివసిస్తున్న వరలక్ష్మీ వైద్యురాలినని చెప్పి... ప్రజలను మోసం చేస్తుంది. అమె చికిత్సా విధానం, మాట తీరు, వైద్యంలో అమె వ్యవహరిస్తున్న పద్దతులపై అనుమానం వచ్చిన స్థానికులు వరలక్ష్మీ ఇంతకీ.. నిజంగా డాక్టరేనా అన్న అనుమానం కలిగింది. దీంతో స్థానికులు అమెపు కాంచన్ బాగ్ ఫోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకుని పశ్నించగా.. అసలు విషయం భయటపడింది. గతంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేసేదని... ఆ అనుభవంతో ఆమె ఏకంగా డాక్టర్ అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తోందని తేలింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arrested  Fake lady doctor  varalakshmi  Kanchanbagh  

Other Articles