ఒక దేశం గురించి చెప్పుకునేందుకు ఎవరైనా ఆదేశ రాజధాని గురించి మొదటగా ప్రస్తావిస్తారు. అలాంటి దేశ రాజధానిగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాల్సిన ఢిల్లీ మాత్రం.. అందుకు భిన్నమైన ఘటనలతో యావత్ దేశ కీర్తిని మంటగలుపుతుంది. ఢిల్లీలో ఏ ప్రాంతం చరిత్ర చూసినా.. ఏమున్నది గర్వకారణం.. అంతా అడపడచుల అర్తికేకలు.. అత్చాచారాల ఘటనలు. రోజుకో గ్యాంగ్ రేపు.. పూటకో రేపు అన్నట్లుగా తయారైంది మన దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి. ఎంతటి దౌర్భాగ్య స్థితి..
ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆడపడుచులు సురక్షితంగా ఇళ్లకు చేరుకునే వరకు అంతా ఎం జరుగుతుందోనన్న ఉత్కంఠ. అన్ని ఎదురుచూపులు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి.. కదులుతున్న వాహనాల్లో సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నా.. ప్రభుత్వాలకు పట్టదా..? అమాయక ఆడపడుచులు వేదనతో అరుస్తున్నా.. ఆర్తిగా కాపాడండి, రక్షించండి.. నన్ను వదలండీ అంటూ వుడుకుంటున్నా.. కామంతో కళ్లుమూసుకుపోయిన కామాంధులు.. కారవంతో విరుచుకుపడి.. అంతటితో అగకుండా మర్మాంగాలలో ఇనుప చువ్వలు, కర్రలు దూర్చడం ఎంత దారుణమో కదా..? అదే పరిస్థితి వారికెదురయితే కాని అర్థం కాదు.
పురుషాధిక్య సమాజంలో రాను రాను మహిళ విలాస వస్తువుగా తయారవుతోందా..? కేవలం మగవాడి కోరికలు తీర్చడానికే.. ఆడపడుచులు వున్నారా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అదే జరిగితే.. మహిళలు సంఖ్య గణనీయంగా తగ్గితే.. అందుకు బాధ్యులెవ్వరూ..? ప్రకృతిలో సమతూల్యత లోపించన పక్షంలో వచ్చే ప్రకృతి ప్రకోపాలు, విలయతాండాలు.. అప్పుడు కూడా వస్తాయని పురుష సమాజం గుర్తెరుగాలి. ఇదే కోనసాగితే అమ్మా ఏదమ్మా నీ చిరునామా అంటూ ఆడవారి కోసం బూతద్దం పట్టుకుని వెతకాల్సిన రోజులు రాక మానవు.
ఇప్పటికే భ్రూణహత్యలతో తల్లడిల్లుతున్న దేశంలో.. వాటిపై అవగాహన కల్పించి.. ఆడపిల్లలే ఇంటికి వెలుగని, చెప్పి.. ఆడపిల్లలను పుట్టుకతోనే చంపే దారుణాలకు మానుకోవాలని జాతిని జాగృతం చేసి గతం నుంచి.. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు ముద్దు అన్న పరిస్థితి వచ్చిన భారతమాత.. మళ్లీ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. నేరాలను పెంచుతూ మగాడు మృగంలా మారితే.. ఆడవారు ఏదో ఒక రోజు అపరకాళీగా అవతారన్ని ఎత్తాల్సిందే. ఆ రోజే కనక వస్తే.. మగాడి పరిస్థితి ఏంటి.?
ఆ రోజు ఎంతో దూరంలో లేదని ఢిల్లీలోని దారుణ ఘటనలు చెబుతున్నాయి, 2015 జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లోనే దేశ రాజధాని దిల్లీలో ఏకంగా 291 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 60 రోజుల వ్యవధిలో.. 291 మంది అభాగినుల శీలాలు మగవాడి పాశవిక దాడిలో కొల్పోయాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీభాయ్ పార్తీభాయ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. ఇప్పటికీ తమ పరువు ఎక్కడ పోతుందో నని ఎంతో మంది అభాగినులు తమపై మగమృగాళ్లు దాడి చేసినా.. భాధనంతా పంటి కింద భరించుకుని.. ఏం జరగలేదనుకుని ఇళ్లకు వెళ్లిన వాళ్లెందరో..!
క్రమక్రమంగా దేశ రాజధానిలో జరుగుతున్న అత్యాచారాల సంఖ్య పెరుగుతున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నరన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఢిల్లీలో 2012లో-706, 2013లో-1636, 2014లో-2166 చొప్పున అత్యాచార కేసులు నమోదయ్యాయి. అయితే అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వాలకు ఇది ప్రచారాస్త్రాంగా మారిందే తప్ప.. నిజంగా ఆడపడచుల భద్రత కోసం.. నేరం జరిగిన తర్వాత చర్యలకు బదులు.. నేరం జరగకుముందే తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం దృష్టి సారించడం లేదు. కేంద్రమంత్రి మాత్రం మహిళలకు భద్రత పెంచడానికి రాజధాని నగరంలో 5200 సీసీ టీవీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా రాక సందర్భంగా యుద్దప్రాతిపదికన జరిగిన పనులు.. మన దేశ ఆడపడులు విషయానికి వచ్చే సరికి మాత్రం నత్తనడకన సాగుతున్నాయా..? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా, ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా లభించిన పక్షంలో పోలీసులతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై పోలీసులను నిలదీసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వుంటుంది. కానీ అలా కాకుండా అటు కేంద్రం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం పెద్దలకు భద్రత కల్పించేందుకు చర్యలను తీసుకోవడంలోనే పోలీసులు నిత్యం బిజీగా మారండంతో వారు మాత్రం ఎం చేయగలరన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినా.. కేంద్రం ఆ చర్యలను సమ్మతించకపోవచ్చు. అదే విధంగా కేంద్రం చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నెపాన్ని ఓకరిపై మరోకరు వేసుకునేందుకు అవకాశం వుంటుంది కానీ, అసలు సమస్య మాత్రం అపరిష్కృతంగానే వుంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఢిల్లీలో నెలకోని వుంది. ఆడపడచులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి...
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more