Anti modi poem on facebook cost bjp media in charge his job

Anti-Modi poem on Facebook, bjp, Anti-Modi poem cost BJP media in-charge his job, Rajkumar prathik, agra bjp cell media convemor, gra, facebook, poem, media, prime minister, narendra modi

BJP's Agra unit on Monday dismissed its local media in-charge for posting an anti-Modi poem on Facebook, criticising the party's support to Mufti Mohammed Sayeed in J&K.

మోడీకి వ్యతిరేకంగా కవిత.. సోషల్ మీడియాలో హల్ చల్..

Posted: 03/10/2015 08:41 PM IST
Anti modi poem on facebook cost bjp media in charge his job

సోషల్ మీడియాతో ప్రజలకు నిత్యం అందుబాటులో వుండాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన సూచన పాటించినందుకు ఆ పార్టీకి చెందిన మీడియా ఇంచార్జ్ పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. సొంత పార్టీ మనిషిని, ప్రధాని సూచనలు పాటిస్తున్న పార్టీ మీడియా ఇంచార్జ్ ను ఎవరు ఉద్వాసన పలికారు..? అసలా నిర్ణయం తీసుకున్నదెవరు..? ఎందుకు..? ఇప్పుడిదే ప్రశ్న బీజేపి సహా అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా యూనిట్ బీజేపీ మీడియా ఇంచార్జ్ రాసిన ఒక కవిత సోషల్ మీడియాలో హల్  చేస్తోంది. దీనికి బోలడన్నీ లైకులు కూడా పడ్డాయట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి  చెందిన కార్యకర్తలు, నాయకులు, కొంతమంది హిందూ సంస్థల నేతలు ఎక్కువగా లైక్ చేస్తున్నారు. అదేంటి బీజేపి నేత కవితకు ప్రతిపక్షాల నుంచి లైకులు రావడమేంటి? అనుకుంటున్నారా..? నిజమేనండి.. ఉత్తర్ ప్రదేశ్ అగ్రాకు చెందిన బీజేపి మీడియా ఇంచార్జ్ రాజ్ కుమార్ పాతిక్ రాసిన కవిత అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇంతకీ ఆ కవిత సారాంశమేమిటంటే..? కశ్మీర్ లోని ముఫ్తీ మహ్మమూద్ సయ్యాద్ కు చెందిన పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీతో సంకీర్ణం ఏర్పాటు చేసుకున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. పాలు పోసి పామును పెంచుతుందని ఆయన తన కవిత్వంలో రాశారు. అంతేకాదు తొందర్లోనే ఆ పాము తన నిజస్వరూపాన్ని చూపుతుందని, పాలు పోసిన నరేంద్రమోదీ ని కాటేసే అవకాశాలు న్నాయంటూ పాతిక్  రాసిన  కవిత  చాలా ఘాటుగానే ఉందని సమాచారం.

 రాజ్ కుమార్ పాతిక్ రాసిన ఈ కవితపై బీజేపి మండిపడింది. ఆయనను తక్షణం పదవి నుంచి తోలగించింది. కానీ కవిత రూపంలో వారి మనోభావాలను చెప్పుకోలేని పార్టీ నేతల మాటేమిటో పార్టీ నేతలే చెప్పాలి. ఇది ఇలా ఉంటే  పాతిక్ తన వాదనను సమర్థించు కుంటున్నారు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని, స్వయంగా మోదీయే పీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడారని  చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇది నా ఒక్కడి వాదన కాదు, వేర్పాటు వాద పార్టీతో  కలవడం దేశ వ్యాప్తంగా విమర్శలకు  గురౌతోందని పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  agra  facebook  poem  media  prime minister  narendra modi  

Other Articles