Ap assembly postpone for tomorrow

ap assembly, jagan, kodela, tdp, chandrababu

ap assembly postpone to tomorrow. ysr congress party attacks on ap govt. ys jagan oppose to collect lands by harassing.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా

Posted: 03/09/2015 03:27 PM IST
Ap assembly postpone for tomorrow

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి, వైయస్ఆర్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం నడిచింది. చంద్రబాబు నాయుడు బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కోవటం సరికాదన్నారు. రైతుల భూములతో రియల్ వ్యాపారం చేస్తారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అని వైఎస్ జగన్  ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం లేదన్నారు. ఇటువంటి వివక్ష ఎక్కడా లేదని, గవర్నర్ ప్రసంగం అనంతరం అధికార పక్ష సభ్యులు రెండు గంటలపాటు మాట్లాడిన అంశాలనే మళ్లీ మాట్లాడారని  జగన్ విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో అధికార పక్షం మొసలికన్నీరు కారుస్తోందని జగన్ అన్నారు. కేంద్రం అనుకున్న మేరకు సహాయం చెయ్యడం లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారని, కానీ మోదీ సర్కార్ నుండి మాత్రం వైదొలడం లేదని విమర్శించారు. కేంద్ర వైఖరిని ఎండగడుతూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి పోరాడవచ్చని సలహా ఇచ్చారు. సభ ప్రారంభం నుండి అధికార, విపక్షాల నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించారు. సభాపతి  సభను మంగళవారానికి వాయిదా వేశారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap assembly  jagan  kodela  tdp  chandrababu  

Other Articles