Swine flu death rate toll to 1239 in india

swine flu, flu, prevention, maharastra, healthdeaprtment, influenja

Swine flu has claimed more lives in india for two months, taking the total death toll to 1239. some countrys warned there citizens at india travel.

స్వైన్ ఫ్లూతో 1239 మంది మృతి.. ప్రకటించిన కేంద్ర ఆరోగ్యశాఖ

Posted: 03/07/2015 05:12 PM IST
Swine flu death rate toll to 1239 in india

దేశంలో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరగుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. అయితే ప్రభుత్వం వ్యాధిని నిరోధిండంలో పూర్తిగా విఫలమవుతోంది. కేంద్ర ప్రభుత్వం వ్యాధిని కట్టడి చెయ్యడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా అన్నీ వృధా అవుతున్నాయి. దేశంలోని దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ తీవ్రంగా ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే దాని తాలూకు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఇరవై మూడు వేల స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయని, 1,239 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

స్వైన్‌ఫ్లూ రాకుండా నివారించడానికి సంవత్సరానికి ఒక సారి ఫ్లూ టీకా వేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ టీకా పలు ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లను నివారిస్తుందని తెలిపింది.  ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వేగంగా విస్తరిస్తున్నాయని, ఇన్‌ఫ్లుయెంజాతో గర్భిణులకు, చిన్నపిల్లలకు, ముసలివాళ్లకు ప్రమాదం ఉంటుందని వెల్లడించింది. మరో పక్క విదేశీయులు దేశానికి రావడానికి భయపడుతున్నారు. ఆయా దేశాలు కూడా భారత్ పర్యటనకు వెళ్లే వారికి పలు సూచనలు చేస్తున్నాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swine flu  flu  prevention  maharastra  healthdeaprtment  influenja  

Other Articles