Indias poor sex ratio for children

childratio, sexratio, census, boy babies, india, policy, genderratio, female, gandergap

The number of children born every year is slowing rapidly in India, but the slowdown is faster for girl babies than for boy babies, new data from the 2011 Census shows.

తగ్గుతున్న బాలబాలికల నిష్పత్తి.. ప్రభుత్వానికి కొత్త చిక్కు

Posted: 03/07/2015 01:01 PM IST
Indias poor sex ratio for children

అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డావురా..అంటూ తెలుగు సినిమా ఓ పాట ఉంది. అయితే ఇప్పుడు ఈ పాట గురించి ఎందుకు అనుకుంటున్నారా. మన కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల క్రితం జనాభాను నియంత్రించడానికి ఒక్కరు లేదా ఇద్దరు అనే నినాదాన్నిచ్చింది. అందులో భాగంగా ప్రజలను మోటివేట్ చేసింది. అదే ఇప్పుడు కొత్త సమస్యకు కారణమైంది. జనాభా నియంత్రణ మాట సంగతి తరువాత లింగ నిష్పత్తి క్రమంగా తగ్గుతుండటం ఇప్పుడు అందరికి కలవరాన్ని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా తగ్గుతున్న బాలబాలికల నిష్పత్తి కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. 2011నాటి 'రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా' తాజా నివేదిక లెక్కలు ఇదే విషయాలను వెల్లడిస్తున్నాయి. జననాల సంఖ్య తగ్గిపోయిందని, మూడో సంతానం కనడానికి ఇష్టపడని కుటుంబాలు పెరిగాయని తేల్చింది. కొడుకును కనాలన్న తాపత్రయం ఎక్కువమంది దంపతులలో ఉందని, ఫలితంగా లింగ వివక్ష మరింత పెరిగిందని నివేదిక విశ్లేషించింది. నవజాత శిశువులలో లింగ నిష్పత్తిలో కూడా భేదం పెరుగుతోందని, మొదటి బిడ్డ లేదా రెండో బిడ్డ వరకే కుటుంబాలు పరిమితమవుతున్నాయని తాజా నివేదిక వెల్లడించింది.

జననాల సంఖ్య కొద్ది కొద్దిగా తగ్గుతోందని, మూడో బిడ్డకు జన్మనిచ్చే కుటుంబాల సంఖ్య బాగా తగ్గిపోయిందని సర్వే నివేదించింది. బాల-బాలికల మధ్య లింగబేధం మరింత పెరిగిపోయిందని, తాజా నివేదిక 2000 సంవత్సరంలో జరిగిన సర్వేతో తాజా వివరాలను విశ్లేషించింది. 2000 సంవత్సరంలో కోటీ 98 లక్షల జననాలు నమోదవగా. 2011లో 2.1 కోట్ల జననాలు నమోదయ్యాయి. జననాల సంఖ్యలో స్వల్ప వృద్ధి మాత్రమే నమోదైంది. బాలుర జననాల సంఖ్య 5.44 శాతం పెరగగా, బాలికల జననాల సంఖ్య 4.69 శాతం పడిపోయింది. ఒకరు లేదా ఇద్దరుతో దంపతులు చిన్న కుటుంబాన్ని మాత్రమే కోరుకుంటున్నారని సర్వే లెక్కలు తెలియజేస్తున్నాయి. అలా భారతదేశంలో రానురాను బాలబాలిక నిష్పత్తి తగ్గిపోవడం రానున్న కాలంలొ విపరీతాలకు తావిస్తుందని కొందరు శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు. అయితే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బాలబాలిక నిష్పతి మరింతగా పడిపోవడం గమనార్హం. హర్యానా ప్రభుత్వం అక్కడ బాలికల జానాభాను పెంచడానికి చర్యలను చేపట్టింది. అందులో భాగంగా కొత్త చట్టాన్ని రూపొందించాలని, అందులో మూడు నెలలు నిండి ప్రతి తల్లి తన పేరును నమోదు చెయ్యాలని ప్రస్తుతానికి నిర్ణయించింది. అయినా ప్రజల్లో లోపించిన అవగాహన వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : childratio  sexratio  census  boy babies  india  policy  genderratio  female  gandergap  

Other Articles