Nasa research suggests mars once had more water than earth s arctic ocean

Mars Once Had More Water than Earth’s Arctic Ocean, NASA Research on Mars, NASA determined primitive ocean on Mars, ocean on Mars held more water than Earth's Arctic Ocean, Red Planet lost 87 percent of water to space, ocean on Mars billion years ago, NASA, NASA scientists, MARS, Arctic Ocean

NASA scientists have determined that a primitive ocean on Mars held more water than Earth's Arctic Ocean and that the Red Planet has lost 87 percent of that water to space.

మార్స్ పైన ఆర్కిటిక్ కన్నా పెద్ద మహా సముద్రం..

Posted: 03/07/2015 08:35 AM IST
Nasa research suggests mars once had more water than earth s arctic ocean

అరుణగ్రహంపై మానవ ఆవాసాలకు యోగ్యమైన వాతావరణం వుందా అన్న ప్రశ్నకు బదులు లభించింది. మార్స్ పై నివాసయోగ్యత కల్పించే ప్రయత్నంలో పోటీ పడిన దేశాలు ఉపగ్రహాలు.. గత కొన్నేళ్లుగా అన్వేషణ కోనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కుజ గ్రహంపై నీటి జాడల ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ ఆసక్తికర విషయాన్ని కనుగొంది. సుమారు 430 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్‌పై మహా సముద్రం ఉండేదని...అరుణగ్రహం ఉపరితలాన్ని సుమారు 450 అడుగుల మేర ముంచేంత స్థాయిలో అందులో నీరు ఉండేదని గుర్తించింది.

అందులోని నీటి పరిమాణం భూమిపై ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రంకన్నా చాలా ఎక్కువగా ఉండేదని... మొత్తంగా మార్స్ మహాసముద్రంపై 2 కోట్ల క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉండేదని లెక్కగట్టింది. ఇది మార్స్ ఉత్తర ధ్రువాన్ని దాదాపు ఆక్రమించేంత స్థాయిలో ఉండేదని అధ్యయనంలో అంచనా వేసింది. కాలక్రమేణా 87 శాతం నీరు అంతరిక్షంలో కలిసిపోయిందని పేర్కొంది. మార్స్‌పై  నీరు ఉండేదని తేలడంతో అక్కడ జీవం కూడా సుదీర్ఘకాలంపాటు కొనసాగి ఉండేదని నాసా అభిప్రాయపడింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Billion years  Mars  Ocean  Earth’s Arctic Ocean  

Other Articles