Interest rates will come down soon

interest rates will come down slowly, union finance minister for state jayant sinha, RBI cuts repo rate to 7.5 percent, Reserve Bank of India, RBI cut its key policy rate, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in March, Reporate Reverse Repo Rate, CRR SLR MSF, union minister jayant sinha,

interest rates will come down slowly says union finance minister for state Jacynth sinha

అప్పుడేనా..! మరికొంత సమయం పడుతుంది..!

Posted: 03/06/2015 01:14 PM IST
Interest rates will come down soon

భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ బి ఐ రెపో రేటును 7.5 నుంచి 7.25 శాతానికి తగ్గించిన దరమిలా వడ్డీ రేట్లు తగ్గింపు తక్షణం అమల్లోకి వస్తాయని ఆశించిన రుణ గ్రహీతలు మరింత కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. బ్యాంకులు వడ్డీ రేటును తప్పనిసరిగా తగ్గిస్తాయని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా అన్నారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయానికి దోహదపడే పలు చర్యలను కేంద్రం తీసుకుందని, వీటి అమలుకు కొంత సమయం వేచి చూడక తప్పదని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

బ్యాంకర్ల ప్రకటన గమనించిన పక్షంలో వడ్డీరేట్ల తగ్గింపు చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తాయన్నారు అయితే ఇందుకు వాటికి కొంత సమయం కావాలని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో రాత్రికి రాత్రి ఏ పరిణామమూ చోటుచేసుకోదన్నారు. త్వరలో బ్యాంకుల రేట్ల కోత చోటుచేసుకుంటుందని జయంత్ సిన్హా అన్నారు. ఆర్‌బీఐ రేట్లకోత నిర్ణయాన్ని స్వాగతించారు. ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు గణనీయంగా తగ్గుతాయనీ అన్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే నిర్ణయంగా దీనిని పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : union minister jayant sinha  RBI  RBI rate cut  Repo rate  

Other Articles