Aap said bye to prashanth yogendra

aap, kejriwal,central committee, prashanthbhushan, yogendrayadav, convenor, pac

aap party decided to remove prashanth, yogendra to their posts. aap party central committee decided to support kejriwal to continue as aap convenor.

మీరు ఉండండి..వాళ్లు వెళ్లండి.. ఆప్ లో రసవత్తరం

Posted: 03/05/2015 08:31 AM IST
Aap said bye to prashanth yogendra

ఆమ్ ఆద్మీ పార్టీ లో గత వారం రోజులుగా ముదిరిన వివాదాలకు ఓ రూపం వచ్చింది. వివాదాలకు కారణంగా భావిస్తున్న ప్రశాంత భూషణ్, యోగేంద్ర యాదవ్ లను తప్పించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో అమీ తుమీకి సిద్ధమైన పార్టీ సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లకు  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి వీడుకోలు పలికారు. 21 మంది సభ్యులున్న జాతీయ కార్యవర్గంలో తమ బలాన్ని చాటుకున్న కేజ్రీవాల్ అనుచరులు ఈ ఇద్దరికీ 11-8 ఓట్ల తేడాతో ఉద్వాసన పలికారు. ఈ సమావేశానికి కేజ్రీవాల్, మాయాంక్ గాంధీలు హాజరు కాలేదు. కేజ్రీవాల్ పార్టీ జాతీయ కన్వీనర్‌గా కొనసాగించడాన్ని, అలాగే ఆయన పని తీరును ఈ ఇద్దరు నేతలు ప్రశ్నించిన కొద్ది రోజులకే వారికి పిఏసినుంచి ఉద్వాసన పలకడం గమనార్హం.

ప్రశాంత్ భూషణ్, యాదవ్‌లపై తీవ్రంగా ధ్వజమెత్తిన కేజ్రీవాల్ అనుచరులు పిఏసి మొదలుకొని జాతీయ కార్యవర్గం దాకా పార్టీలోని అన్ని విభాగాలపై తమకే పట్టు ఉండాలని ప్రశాంత్ భూషణ్, ఆయన తండ్రి శాంతి భూషణ్‌లు కోరుకుంటున్నారంటూ ఎదురు దాడి చేయడం తెలిసిందే. వాడీ, వేడిగా సాగిన కార్యవర్గ సమావేశం ఈ ఇద్దరినీ రాజకీయ వ్యవహారాల కమిటీనుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇద్దరు నాయకులు సమావేశంనుంచి బయటికి వెళ్లిపోయారు. తాను పార్టీకి అంకితమైన కార్యకర్తగా ఇకపై కూడా కొనసాగుతానని యాదవ్ చెప్పగా. మెజారిటీ నిర్ణయమే చెల్లుబాటవుతుందని భూషణ్ అన్నారు. కాగా, యాదవ్, భూషణ్‌లను రాకీయ వ్యవహరాల కమిటీ సభ్యుల బాధ్యతలను తప్పించాలని జాతీయ కార్యవర్గం నిర్ణయించిందని, వారికి కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని సమావేశం అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ బిశ్వాస్ చెప్పారు. మొత్తానికి కన్వీనర్ పదవి నుండి కేజ్రీవాల్ ను తప్పించకుండా, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లను పదవుల నుండి తప్పించారు. అయితే తాజాగా పార్టీ తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. పార్టీలో చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరి భావన.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  kejriwal  central committee  prashanthbhushan  yogendrayadav  convenor  pac  

Other Articles